విశాఖపట్నం

విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, జనవరి 19: వాతావరణంలో వస్తోన్న మార్పులు తదితర కారణాలతో విశాఖలో స్వైన్‌ఫ్లూ రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ఒక పాజిటివ్ కేసుకు సంబంధించిన రోగి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో తొమ్మిది మంది రోగులు అనుమానితులుగా గుర్తింపబడ్డారు. వీరి నుంచి రక్తనమూనాలను సేకరించారు. వీటిని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. అలాగే జిల్లాలో మరో మూడు కేసులు తాజాగా అనుమానితంగా గుర్తించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. స్వైన్‌ఫ్లూ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సరోజిని, స్వైన్‌ఫ్లూ నోడల్ అధికారి డాక్టర్ కల్యాణ్‌ప్రసాద్‌లు రోగులకు అవసరమైనన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ జిల్లాతోపాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌ల నుంచి రోగులకు విశాఖ వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని, వారిక్కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. గతంలో రక్తనమూనాలు సేకరించి హైదరాబాద్, ఢిల్లీ వైరాలజీ ల్యాబ్‌లకు పంపేవారని, నివేదిక ఆలస్యం కావడంతో ఆయా రక్తనమూనాలను తిరుపతిలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌కు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. దీనిలోభాగంగా గతంలో ప్రతిపాదించిన స్వైన్‌ఫ్లూ, వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసే కార్యక్రమం ప్రతిపాదనలకే పరిమితమైంది. రోగులకు అందుతున్న సేవలు, ప్రత్యేక వార్డుల ఏర్పాటు తదితర వాటిని పరిశీలించేందుకు స్టేట్ మైక్రో బయోలజిస్ట్ డాక్టర్ భార్గవి బృందం టిబి ఆసుపత్రి, కేజిహెచ్‌లను సందర్శించి మందులు, మాస్క్‌లు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లావైద్య,ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ సరోజని మాట్లాడుతూ రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో వైద్యసేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మందులు అందుబాటలోనే ఉన్నాయన్నారు. గొంతు నొప్పి, జలుబు, తీవ్ర ఆయాసం తదితర లక్షణాలు ఉంటే సకాలంలో వైద్యుని సంప్రదించాలన్నారు.