విశాఖపట్నం

16కి చేరిన స్వైన్‌ఫ్లూ కేసులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 23: విశాఖ నగరంలో స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గత రెండు రోజుల వ్యవధిలోనే నలుగురు వరకు అనుమానిత లక్షణాలతో కూడిన రోగులకు రక్త నమూనాలు సేకరించి వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఇప్పటికే స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఓ మహిళా రోగి మృతి చెందగా సోమవారం తాజాగా మరో ఇద్దరికి అనుమానిత లక్షణాలు కలిగి ఉండటంతో వీటి సంఖ్య 16కి చేరిందని, స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్ ప్రసాద్ తెలిపారు. రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేజిహెచ్, టిబీ ఆసుపత్రిల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసామని, ప్రస్తుతానికి ఛాతి ఆసుపత్రిలో ఓ రోగికి అత్యవసరంగా వైద్యసేవలు అందిస్తున్నామని వైరాలజీ ల్యాబ్ నుంచి నివేదిక రాగానే పూర్తిస్థాయిలో మిగిలిన వారందరికీ వైద్య సేవలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇందులోభాగంగానే జిల్లావైద్య, ఆరోగ్యశాఖాధికారిణి జె.సరోజని సోమవారం తన కార్యాలయంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ పిహెచ్‌సి పరిధిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు, వ్యాధి నివారణ సంబంధించి ప్రత్యేక అవగాహన, కరపత్రాలను పంపిణీ చేయాలని గ్రామాల్లో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్‌ప్రసాద్, పలువురు ప్రోగ్రామ్ అధికారులు పాల్గొన్నారు.