విశాఖపట్నం

కొవ్వాడలో అణు విద్యుత్ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 4: కొవ్వాడ లో అణువిద్యుత్ ప్లాంట్ వద్దని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రభుత్వానికి డిమాండ్ చేసింది. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది. ఆంధ్ర రాష్ట్రంలో రెండు అణువిద్యుత్ ప్లాంట్లు (కొవ్వాడ, కావలి)లో నెలకొల్పనున్నట్టు కేంద్ర అణువిద్యుత్ శాఖ సహాయ మం త్రి జితేంద్రసింగ్ రెండు రోజుల కిందట ప్రకటించారని ఫోరం ఫర్ బెటర్ విశాఖ ప్రతినిధి ఇఎన్‌ఎన్ శర్మ పేర్కొన్నారు. ద్వారకానగర్ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రమాదకరమైన అణువిద్యుత్ కేంద్రం అంటే భారీ ఆటంబాంబు వంటిదని అన్నారు. వాటి ద్వారా విడుదలయ్యే వ్యర్ధాలు ట్రెషి యం, స్ట్రోన్షియం, ఫ్లూటోనియం భయంకరమైన రసాయన పదార్ధాలు మనిషిలో చేరి వివిధ రకాలైన వ్యాధు లకు దారితీస్తాయన్నారు. అణు విద్యు త్ కేంద్రంలో ప్రమాదం సంభవిస్తేకొవ్వాడ నుండి 177 కిలోమీటర్ల పరిధిలో జనవాసాలు అన్నీ ఖాళీ చేయాల్సి ఉం టుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ.అజయ్‌శర్మ మాట్లాడుతూ కొవ్వాడ భూకంపాల జోన్‌లో ఉన్నందున అణు విద్యుత్ కేం ద్రాన్ని వ్యితిరేకించాల్సి వస్తుందన్నారు. కొవ్వాడలో నిర్మించే రియాక్టర్లు ఏపి వెయ్యి ఇంతవరకు ప్రపంచంలో ఎక్క డా పరీక్షించబడలేదన్నారు. 2011లో బల్గేరియా ప్రభుత్వం ఏపి వెయ్యి రియాక్టర్లను ప్రారంభించడానికి అనుమతించలేదన్నారు. ప్రపంచంలో యురేనియం అత్యధికంగా లభించే ఆస్ట్రేయాలియా లో ఒక అణు విద్యుత్ కేంద్రం కూడా లేదన్నారు. పుకుషిమా ప్రమాదం తరువాత అమెరికా సహ అనేక దేశాల్లో అణువిద్యుత్ కేంద్రాలను మూసివేశారన్నారు. అణువిద్యుత్ టెక్నాలజీ అవుట్‌డేటెడ్ టెక్నాలజీగా భారీ వ్యయంతో కూడుకున్నదిగా తెలిపారు. (రూ.2.8 లక్షల కోట్లు) అమెరికాతో లాభమని, దేశానికి అన్నివిధాలా నష్టంగా తెలిపారు. దీని వలన అమెరికాలో 40 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, కొవ్వాడలో స్థానికులకు ఒక్క ఉద్యోగం కూడా రాదని, ఉత్తరాంధ్ర ప్రజలు ప్రాణాలను పణం గా పెట్టి నిర్మించే ఈ అణువిద్యుత్ ప్రాజెక్టులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రమాదకరమైన అణు విద్యు త్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదన వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశా రు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉత్తరాం ధ్ర ప్రత్యేక అభివృద్ధి నిధులు వెం టనే విడుదల చేయాలని, నీటి ప్రాజెక్టు లు, విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని, అలాగే విశాఖకు రైల్వేజోన్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.