విశాఖపట్నం

అన్నదాత సంక్షేమానికి రైతు ఉత్పత్తి సంఘాలు దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 20: అన్నదాతల సంక్షేమం, అభివృద్ధికి దోహదపడేవి రైతు ఉత్పత్తి సంఘాలని, జిల్లా రైతులు పెద్దఎత్తున ఈ సంఘాలను ఏర్పాటు చేసి జిల్లాలో ప్రాథమిక రంగ అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినమ్ జూబ్లీ అతిథిగృహం సమావేశ మందిరంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల రైతు ఉత్పత్తి సంఘాల ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరితో పాటు పాల్గొన్న కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రాథమిక రంగ అభివృద్ధికై పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలుపర్చడం జరుగుతుందన్నారు. అయితే పటిష్టమైన ఒక ఉమ్మడి వేదిక లేకపోవడం వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులు సక్రమంగా వినియోగం చేసుకోలేకపోవడం, ఉత్తమ వ్యవసాయ విధానాలను అనుసరించలేకపోవడం జరుగుతుందన్నారు. అదే సమయంలో సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు సరైన గిట్టుబాబు ధర లభించకపోవడం, దళారుల ప్రమేయం అధికమవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి రైతులు పూర్తిస్థాయిలో లబ్ధి పొందాలంటే అన్ని గ్రామాల్లో రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రైతులదందర్ని సమైక్యపరిచి రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసుకునేలా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, సిబ్బందితోపాటు స్వచ్చంధ సంస్థలు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలన్నారు. ఇందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలుపర్చాలన్నారు. అపుడే జిల్లాలో ప్రాథమిక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసే సహాయ సహకారాలను రైతులు సద్వినియోగం చేసుకుని వ్యవసాయ ఉత్పత్తులను గణనీయంగా పెంచుకుంటూ స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో రైతు ఉత్పత్తి సంఘాల విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అయితే ఇప్పటికే పలు రూపాల్లోనున్న వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాల స్థానంలో ఈ రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. ఉన్న సంఘాలనే శక్తివంతంగా తీర్చిదిద్దే అంశంపై అధికారులు, స్వచ్ఛంద సంస్థలు దృష్టి సారించాలన్నారు. రైతు ఉత్పత్తి సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై రైతులను వత్తిడి చేయకుండా తొలుత సంఘాల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలని, అవసరాన్నిబట్టి దశలవారీగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి సిఎస్ రెడ్డి మాట్లాడుతూ రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటు ప్రక్రియను వివరించారు. క్షేత్రస్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకూ పొదుపు సంఘాలను ఏ విధంగా శక్తివంతంగా తీర్చిదిద్దడం జరిగిందో వివరిస్తూ అదే తరహాలో రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. నాబార్డు ఎజిఎం కెవిఎల్‌ఎస్‌ఎస్‌ఎన్ ప్రసాదరావు మాట్లాడుతూ రైతు ఉత్పత్తి సంఘాలకు నాబార్డు ఏ విధంగా రుణ సౌకర్యాలు కల్పిస్తుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఉద్యానవన పరిశోధన సంస్థ సంచాలకులు జె.దిలీప్‌బాబు, రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి సిఎస్ రెడ్డి, నాబార్డు ఎజిఎం కెవిఎల్‌ఎస్‌ఎస్‌ఎన్ ప్రసాదరావు, ఇక్రిశాట్ సైంటిస్టు శ్రీకాంత్, బాపట్ల జీడి పరిశోధన సంస్థ సైంటిస్టు ఉమామహేశ్వరరావుతోపాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.