విశాఖపట్నం

విశాఖ పర్యాటకానికి విస్తృత అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: పర్యాటకంగా విశాఖను అభివృచేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా విశాఖను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్నట్టు పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ వెల్లడించారు. నగరంలో శుక్రవారం జరిగిన ప్రాంతీయ పర్యాటక సదస్సులో ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగంలో ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్నారు. పర్యాటక రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా వికేంద్రీకరణ చేపట్టామన్నారు. అనుమతులు సరళతరం చేయడంతో పాటు జిల్లా స్థాయిలోనే టూరిజం కౌన్సిల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తద్వారా ప్రైవేటు రంగంలో ఏర్పాటయ్యే ప్రాజెక్టులకు భూ కేటాయింపులు, అనుమతులు త్వరితగతిన ఇచ్చేందుకు వీలవుతుందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఐదు టూరిజం హబ్‌లలో సందర్శకులను ఆకట్టుకునే విధంగా ప్యాకేజీ టూర్లను ప్రోత్సహించాల్సి ఉందన్నారు. అలాగే సందర్శకులకు అవసరమయ్యే వసతి కల్పనకు అతిధిగృహాలు, రిసార్ట్స్, హోటళ్ల నిర్మాణం ప్రోత్సహిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ పర్యాటకంగా విశాఖకు విస్తృత అవకాశాలున్నాయన్నారు. ఒక్క విశాఖ నగరంలోనే 45 కిమీ మేర తీర ప్రాంతం ఉందన్నారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటవుతున్న నేపథ్యంలో రోడ్డు, రైలు, విమాన కనెక్టివిటీ పెరుగుతుందని, పర్యాటకులను ఆకర్షించేందుకు ఇది మంచి అవకాశమన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ0 ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సిఐఐ ఎపి టూరిజం డైరెక్టర్ నీరజ్ శారద, సిఐఐ ఎపి చైర్మన్ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ విశాఖలో బీచ్ టూరిజం అభివృద్ధికి మంచి అవకాశాలున్నాయన్నారు. వాటర్ స్పోర్ట్స్‌కు అనువైన వాతావరణం ఉందన్నారు. అలాగే అరుకు, బొర్రా గుహలు, కంబాలకొండ ఎకో టూరిజం ప్రాజెక్టు, బౌద్ధ ఆరామాలు, కైలాసగిరి వంటి పర్యాటక ప్రాంతాలకు సందర్శకులను ఆకర్షించాలన్నారు. ఇక్కడ సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం టూరిస్ట్ ఆపరేటర్లతో రెండు సెషన్లలో చర్చలు జరిపారు. ప్యాకేజీ టూర్లకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని ప్రోత్సహించాలని సూచించారు.