విశాఖపట్నం

ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుంటే చాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 6: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల ఎన్నికల్లో ఓటర్లు విధిగా గుర్తింపు కార్డు కలిగి ఉండాలని, అది ఓటరు గుర్తింపు కార్డు కానవసరం లేదని, ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరని ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9న జరిగే పోలింగ్‌కు ఓటర్లు తప్పనిరిగా గుర్తింపు కార్డుతో హాజరు కావాలన్నారు. ఆధార్, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, డిగ్రీ, డిప్లొమా ఒరిజినల్ సర్ట్ఫికెట్లు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డుల్లో దేన్నైనా అనుమతిస్తామన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న వారు సంస్థ జారీ చేసిన గుర్తింపుకార్డును ఉపయోగించుకోవచ్చన్నారు. పోలింగ్ ఈ నెల 9వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ కాజువల్ లీవు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశాన్ని కల్పించాల్సిందిగా యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, కెమేరాలు వంటి పరికరాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. పోలింగ్ ప్రక్రియ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నుంచి సభలు, సమావేశాలు సహా అభ్యర్థుల, రాజకీయ పార్టీల ప్రచారం నిషేధమని ఎన్నికల అధికారి ప్రకటించారు. మంగళవారం సాయంత్రం నుంచి నిషేధం అమల్లోకి వస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 409 లైసెన్స్‌డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, 69మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని, 254 మందికి నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినట్టు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 9న జరిగే పోలింగ్‌కు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.