విశాఖపట్నం

ఆదాయం కోసం ఆర్టీసీ అవస్థలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 9: ఈ వేసవి సీజన్‌లో ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిధిలో ప్రత్యేక బస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్ళే భక్తులు, ఇళ్ళకు చేరుకునే విద్యార్థులు, పర్యాటక కేంద్రాలు సందర్శించేందుకు తరలివెళ్ళే ఉద్యోగుల కోసం తగినన్ని బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఈ రీజియన్ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కనీసం వందకు తక్కువ లేకుండా ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించే క్రమంలో చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే దశలవారీగా సమావేశాలు జరుపుతున్న అధికారులు విజయవాడ, రాజమండ్రి కేంద్రాలుగాను వీటిని నిర్వహిస్తున్నారు. ఇటీవల కృష్ణాజిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడిన సంఘటనలో అనేకమంది మృతిచెందిన సంఘటనతో ప్రయాణికులు భయపడుతున్నారు. మెరుగైన వసతులు కల్పిస్తున్నామంటూ ప్రచారం చేసే ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించడం అంత శ్రేయస్సుకరం కాదనే భావనతో ఇక ఆర్టీసీలోనే వెళ్ళేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా గత కొద్దిరోజుల నుంచి విశాఖ నుంచి సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కడప, రాజోలు, కాకినాడ, రాజమండ్రి, భీమవరం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు వెళ్ళే ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌లు, వాల్వోలు, సూపర్ లగ్జరీలకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల నుంచి ఈ విధమైన ఆదరణ లభిస్తుండటంతో వేసవి సీజన్‌లో అవసరమైనన్ని ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించాలని రీజియన్ అధికారులు నిర్ణయించారు. ఇందులోభాగంగా తొలుత 50 ప్రత్యేక బస్సులు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావడం, ప్రయాణికుల ఆదరణ పెరిగితే మరికొన్నింటినీ రోడ్డెక్కించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల రెండవ వారం నుంచి పూర్తిస్థాయిలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ప్రతిరోజు నడుస్తున్న సాధారణ బస్సులతోపాటు ఈ వేసవి సీజన్‌లో 100 నుంచి 150 ప్రత్యేక బస్సులునైనా నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. వీటిలో ఎక్కువుగా సికింద్రాబాద్, తిరుపతి, శ్రీకాళహస్తి, ఒంగోలు, చెన్నై, బెంగుళూరు, శ్రీశైలం తదితర సూదూర ప్రాంతాలకు కనీసం 50 ప్రత్యేక బస్సులు నిర్వహించాలని ఈ రీజియన్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
పోలింగ్ ప్రశాంతం
గాజువాక, మార్చి 9: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జివిఎంసి గాజువాక జోనల్ పరిధిలో ప్రశాంతంగా ముగిసింది. గాజువాక జోనల్ పరిధిలో 11వేల 485 ఓటర్లుకు ఎన్నికల కమీషన్ ఓటు హక్కు కల్పించారు. ఓటర్లు వారి వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా గాజువాక జోనల్ పరిధి 13 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గురువారం 8గంటల ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం కాస్త వేగవంతంగా జరిగినప్పటికీ 10గంటల తరువాత కాస్త మందకొడి కొనసాగింది. పట్ట్భద్రులు వారి వారి ఓటును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలు వద్ద బార్లు తీరారు. మధ్యాహ్నాం 12 నుండి 2 గంటల వరకు పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక ఖాళీ కనిపించాయి. నాలుగు గంటల తరువాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రావడం కనిపించింది. సాధారణ ఎన్నికల మాదిరిగానే బిహెచ్‌పివి, గాజువాక, నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో గల పోలింగ్ కేంద్రాల వద్ద హడావిడి అధికంగా కనిపించింది. గాజువాక జోనల్ పరిధిలోనే అత్యధికంగా టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తల హడావిడి పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని గాజువాక ఎసిపి జి.రామ్మోహనరావు ప్రత్యేక బలగాలను పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. గాజువాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు పోలింగ్ కేంద్రాలను, బిహెచ్‌పివి పాఠశాలలో మూడు కేంద్రాలను, నడుపూరులో రెండు కేంద్రాలను, కణితి ఉన్నత పాఠశాలలో మూడు కేంద్రాలను , ఉక్కునగరం డిఎవి పాఠశాలల్లో రెండు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేసింది. పరవాడ మండల పరిధిలో ఉన్న ఉక్కునగరం ఢిల్లీ పబ్లిక్ పాఠశాలలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల వద్ద ఓటర్లు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులు సందర్శించారు.