విశాఖపట్నం

అడుగంటుతున్న వరాహ పుష్కరిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఏప్రిల్ 3 : శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి పుష్కరిణి అడుగంటుతోంది. వర్షాధారితమైన వరాహ పుష్కరిణి ఈశాన్యం మూలలో ఇప్పటికే నీరులేక నేల దర్శనమిస్తోంది. అడుగంటిన నీరు చెత్తాచెదారంతో కాలుష్యం కోరల్లో చిక్కుకుంటోంది. పుష్కరిణి నైరుతి మూలలో స్నానఘట్టం వద్ద నీరు అంతంత మాత్రంగానే ఉంది. సింహాచలేశుని దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో దేవాలయానికి వచ్చే భక్తు సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ కాలంలో వచ్చే భక్తులు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల వారు కొండదిగువ వరాహ పుష్కరిణీలో పుణ్యస్నానాలు చేసి భైరవుడ్ని దర్శించుకొన్న తరువాతనే సింహగిరికి వెళ్ళి అప్పన్నను దర్శించుకుంటారు. శని, ఆదివారాలతో పాటు వైశాఖ, జ్యేష్ట పౌర్ణమి రోజుల్లో వరాహపుష్కరిణీ ఇసుకేస్తే రాలనంతమంది భక్తులుంటారు. పుష్కరిణీ గట్టులపైనే వంట,వార్పు చేసుకుని గంగమ్మతల్లికి, సింహాద్రినాథునికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ ఆచారాన్ని పాటించే వారిలో అధిక శాతం గంగపుత్రులైన జాలర్లే ఉంటారు. ఉత్తరాంధ్రా సముద్రతీర ప్రాంతాల్లో నివాసముండే జాలర్లు గరిడీ బృందాలుగా వస్తారు. సింహాచలేశుడు ఉభయ దేవేరులతో విహరించే ఈ వరాహ పుష్కరిణీని పరమ పవిత్రంగా భావించే భక్తకోటి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇంతటి చరిత్రగల వరాహ పుష్కరిణీ పూర్తిగా వర్షాధారితం కావడం, ఇటీవల వర్షాలు ఆశించినంతగా కురవకపోవడం, కురిసిన వర్షం నీటిని పుష్కరిణీకి మళ్ళించడంలో దేవస్థానం అధికారులు అలసత్వం వహించడం వంటి కారణాలతో పుష్కరిణీ అడుగంటిపోతున్న పరిస్థితి వచ్చింది. పుష్కరిణీలో స్నానాలకు ఇబ్బంది ఏర్పడే పరిస్థితిని అధిగమించేందుకు దేవస్థానం ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ చెరువులో మునగాలన్న భక్తుల కోరిక తీరాలంటే మాత్రం వర్షాలు పడి ఆనీరు పుష్కరిణీకి చేరాల్సిందే లేదంటే రానున్న రోజుల్లో స్నానాలకు భక్తులు మరింత ఇబ్బంది పడక తప్పదు. ఈ నేపథ్యంలో అధికారులు పైపులైను పనులు వీలైనంత త్వరగా పూర్తిచేసి కొండ గెడ్డల ద్వారా వచ్చే వర్షం నీటికి దారులను చూపాల్సిన అవసరం ఉంది.