విశాఖపట్నం

ఉద్వేగ క్షణాల మధ్య టియు నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 8: ఉద్వేగ క్షణాల మధ్య టియు-142ఎం యుద్ధ విమానం భారత నౌకాదళం నుంచి తన సేవలను పూర్తిగా విరమించుకుంది. ఇప్పుడు ఈ విమానం కేవలం ప్రజల సందర్శనకు మాత్రమే. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ విమానం అత్యంత సాహసోపేతంగా యుద్ధ రంగంలో నిలిచింది. అణు జలాంతర్గాములను సైతం కనిపెట్టి, మట్టుపెట్టగల సామర్థ్యం ఈ విమానికి ఉంది. 29 సంవత్సరాలపాటు 30 వేల కిలో మీటర్లు ప్రయాణించి, భారత నౌకాదళానికి వీరోచిత సేవలను అందించింది. ఈ తరహాకు చెందిన ఎనిమిది విమానాలు భారత నౌకాదళంలో సేవలు ముగించుకున్నాయి. వీటి స్థానే అమెరికా నుంచి కొనుగోలు చేసిన పి-8ఐ యుద్ధ విమానాలు ఇప్పుడు భారత నౌకాదళంలో చేరాయి.
ఈ సందర్భంగా తూర్పు నౌకాదళ అధికారి బిస్ట్ మాట్లాడుతూ రక్షణ రంగంలో టియు-142 విమానానికి మంచి గుర్తింపు ఉందని అన్నారు. త్వరలోనే ఈ విమానాన్ని బీచ్ రోడ్డులో మ్యూజియంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ ఘనత చంద్రబాబుదే
ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక చరిత్ర సృష్టించారు. 2003లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రస్తుతం బీచ్ రోడ్డులో ఉన్న కురుసుర సబ్‌మెరైన్‌ను మ్యూజియంగా మలిచారు. మళ్లీ ఇప్పుడు టియు-142ని మ్యూజియంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బీచ్ రోడ్డులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన, నిలువనున్న ఈ మ్యూజియంలు రెండూ చంద్రబాబు హయాంలోనే రావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీచ్ రోడ్డులో కురుసుర మ్యూజియం దగ్గర నుంచి ఆ ప్రాంతాన్నంతా నేవీ టూరిజంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, ఎంపిలు హరిబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, గణబాబు, పంచకర్ల రమేష్ బాబు, కిడారి సర్వేశ్వరరావు, అనిత, ఎమ్మెల్సీలు ఎంవిఎస్ మూర్తి, మాధవ్, పప్పల చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.