విశాఖపట్నం

ఎన్‌ఏడి ఫ్లైఓవర్‌కు 15 రోజుల్లో డిపిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 11: ఎన్‌ఎడి ఫ్లైఓవర్‌ను త్వరితగతిన నిర్మించాలని సిఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారు. మంగళవారం విశాఖ వచ్చిన చంద్రబాబు నాయుడు నగరంలో అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ముఖ్యంగా ఎన్‌ఏడి ఫ్లైఓవర్ విషయమై ఆయన మాట్లాడుతూ 15 రోజుల్లో డిపిఆర్ సిద్ధం చేయాలని సూచించారు. చక్కటి డిజైన్ రూపకల్పన చేయాలి. ప్రజలంతా హర్షించే విధంగా ఆ ఫ్లైఓవర్ ఉండాలి. ఆవిధంగా డిజైన్‌ను సిద్ధం చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయడానికి నిర్దేశిత గడువు విధించాలని సిఎంను కోరారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, ఫ్లైఓవర్ పనులకు వచ్చే నెలలోనే శంకుస్థాపన జరగాలని ఆదేశించారు. అలాగే, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి కావాలని చెప్పారు. ఇందుకోసం ప్రతి నెల ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పనుల ప్రగతిని సమీక్షించాలని ఆయన సూచించారు. అలాగే ఆనందపురం, అనకాపల్లి ఆరు లైన్ల రహదారి పనులకు సంబంధించి, భూసేకరణ, తదితర పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
పెందుర్తి నియోజకవర్గం ముదపాక అసైన్డ్ భూములను విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించాలన్న నిర్ణయం, చోటుచేసుకున్న పలు అవకతవకలపై సిఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం. అసైన్డ్ భూములను రైతుల నుంచి సేకరించే అంశంలో పార్టీపైన, ప్రభుత్వంపైనా అనేక విమర్శలు వెల్లువెత్తాయని, దీంతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా వుడా అధికారులు ముదపాక అసైన్డ్ భూముల విషయంలో తీసుకున్న పలు నిర్ణయాలు వివాదస్పదం కావడంపై మండిపడ్డారు. డి పట్టా భూములను రైతుల నుంచి సేకరించే విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టైందని, మిత్రపక్షం కూడా ఈ విషయంలో వుడా తప్పిదాల్ని వేలెత్తి చూపే వరకూ వెళ్లడం మంచి పరిణామం కాదని, ఈ విషయంలో వుడా అధికారులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే బాగుండేదని అన్నట్టు సమాచారం. అమరావతిలో వేలాది ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించినప్పటికీ ఇంతటి విమర్శలు ఎదురకాలేదని, ఇక్కడ మాత్రం విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టైందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ముదపాక భూముల వ్యవహారంలో వుడా అధికారుల తిప్పదాలతో పాటు స్థానిక పార్టీ ప్రతినిధుల తీరుపై కూడా ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సమావేశంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.