విశాఖపట్నం

అంతరాలయ దర్శనానికి రాజీపడొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఏప్రిల్ 28, శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి నిజరూప దర్శనం (చందనోత్సవం) వేడుకను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విఐపిల తాకిడితో ప్రతి ఏటా సామాన్య భక్తుడు ఎదుర్కొంటున్న సమస్యలతో దేవస్థానానికి, తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది విఐపిల విషయంలో సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుని వాటిని అమలు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళుతున్నారు. ఈ నేపథ్యంలో విఐపి టిక్కెట్లను గణనీయంగా తగ్గించామని ఆయన ఇది వరకే ప్రకటించారు. దీంతో పాటు ఈ ఏడాది విఐపిల అంతరాలయ దర్శనాలకు కూడా చెక్ పెడుతున్నట్లు చెప్పారు. అనువంశిక ధర్మకర్త హోదాలో కేంద్రమంత్రి అశోకగజపతిరాజు కుటుంబంతో పాటు గవర్నర్ వంటి అతి ముఖ్య విఐపిలను మాత్రమే అంతరాలయంలోకి అనుమతించాలని నిర్ణయించారు. మిగిలిన వారినెవరిని అంతరాలయంలోకి అనుమతించ వద్దని ఈ విషయంలో ఎన్ని ఒత్తిళ్ళు వచ్చిన తలొగ్గొదని మంత్రి గంటా శ్రీనివాసరావు దేవస్థానం ఈవో రామచంద్రమోహన్‌ని మరోసారి ఆదేశించారు. శుక్రవారం సింహగిరికి వచ్చిన ఆయన ఏర్పాట్లను పరిశీలించి ఈవో, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీలాద్రి గుమ్మం నుండి అంతరాలయంలో స్వామివారి నిజరూపం ఎలా ? కనిపిస్తోందో మంత్రి పరిశీలించారు. అక్కడ దర్శనం కోసం వస్తున్న భక్తులను మంత్రి ఆరా తీసారు. ఇక్కడ నుండి స్వామివారు కనిపిస్తున్నారా ? అంటూ నిత్య రూపంలో ఉన్న స్వామివారిని చూపించి భక్తులను ఆయన ప్రశ్నించారు. వంతెన ఏర్పాటులో జాగ్రత్తలు వహించాలని స్వామివారు సరిగ్గా కనిపించడంలేదన్న అసంతృప్తి భక్తుల్లో రాకుడదని మంత్రి దేవస్థానం అధికారులకు చెప్పారు. అంతరాలయ దర్శనం, విఐపి టిక్కెట్ల విషయంలో ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అనేక మంది ప్రముఖుల నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తోందని మంత్రి చెప్పారు. అయినప్పటికీ రాజీ పడాల్సిన అవసరంలేదని మంత్రి గంటా ఈవోకి చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన విలేఖరులతో కూడా అన్నారు. విఐపిలు పెరిగే కొద్దీ సామాన్యుడికి దర్శనం ఇబ్బందవుతుందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోను రాజీ పడొద్దని ఆయన ఈవోకి పదేపదే చెప్పారు. విఐపిలు తమకు నిర్దేశించిన సమయాలలోనే దర్శనానికి వచ్చి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేసారు. గత ఏడాదితో పోలిస్తే అన్ని విదాల భక్తులకు మెరుగైన సదుపాయాలే కల్పించడం జరిగిందని ఆయన అన్నారు. ప్రధానంగా చలువ పందిళ్ళు మంచి ఫలితానిస్తాయని ఆశిస్తున్నట్లు మంత్రి చెప్పారు. త్రాగునీరు, ప్రసాదాలు విరివిగా భక్తులకు అందేలా చూడాలని ఆయన అన్నారు. సుమారు 60 స్వచ్ఛంద సంస్థలు సేవలందించనున్నాయని ఈవో మంత్రికి చెప్పారు. పారిశుద్ద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అవసరమైతే జివియంసి కమిషనర్‌తో మాట్లాడతానని మంత్రి అన్నారు. కొండ దిగువ ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేకంగా సిబ్బందిని అందుబాటులో ఉంచుకొనెలా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడాలని మంత్రి ఈవోకి ఆదేశించారు. సింహగిరి పై కూడా వైద్య సేవలు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. పోలీసు బలగాల విషయమై మంత్రి ఎసిపిలు కింజరాపు ప్రభాకర్, భీమారావులను అడిగి తెలుసుకున్నారు. సుమారు. రెండు వేల మంది పోలీసులు చందనోత్సవ నిర్వహణలో భాగస్వాములవుతున్నారని పోలీసు అధికారులు మంత్రికి చెప్పారు. కమిషనర్ యోగానంద్ పర్యవేక్షణలో పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని మంత్రి మీడియాకి తెలియజేసారు.ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన పోలీసులకు చెప్పారు. తెల్లవారుజాము నుండి రాత్రి వరకు దేవాలయంలో జరిగే కార్యక్రమాల వివరాలను మంత్రి ఈవోని అడిగి తెలుసుకున్నారు. వి ఐపిల దర్శనాల సమయంలో సాధారణ భక్తుల దర్శనాలు నిలిపి వేయడం ఉండదని ఆలయ ఆచారం ప్రకారం ధర్మకర్త దర్శనం పూర్తయిన వెంటనే సాదారణ క్యూలలోని భక్తులనే దర్శనాలకు అనుమతిస్తామని మంత్రి చెప్పారు. మీడియాతో పాటు అందరూ సహకరించాలని చిన్నచిన్న లోటు పాట్లు ఉంటే సూచనలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
* ప్రత్యేక పూజలు
మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం సింహాచలేశుని దర్శనం చేసుకున్నారు. దేవాలయ సంప్రదాయం ప్రకారం ఈవో రామచంద్రమోహన్ అర్చక పరివారంతో కలిసి మంత్రికి స్వాగతం పలికారు. అంతరాలయంలో అర్చకులు మంత్రి పేరున సంప్రదాయ పూజలు చేసి ఆశీర్వదించారు.