విశాఖపట్నం

మది తన్మయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, ఏప్రిల్ 29, ఏడాది పాటు ఎదురు చూసిన భక్తజనుల నిరీక్షణ ఫలించింది. మూడు వందల అరవై నాలుగు రోజులు శ్రీ గంధపు మేలుముసుగులో దాగివున్న సింహాచలేశుడు చందనపు మైపూతను తొలగించుకొని వైశాఖ శుద్ద పర్వదినం సందర్భంగా శనివారం భక్తులకు దర్శనమిచ్చాడు. వరాహ వదనంతో నరమృగ శరీరంతో దర్శనమిచ్చిన సింహగిరి నరహరి నిజరూపాన్ని కనులారా కాంచిన భక్తులు పులకించిపోయారు. ప్రోటోకాల్ టిక్కెట్ల భక్తులకు కేటాయించిన సమయాల్లో తప్పా మిగిలిన ఉత్సవమంతా సానుకూలంగానే సాగిపోయింది. తెల్లవారుజామున రెండున్నర గంటలకు దేవాలయ అనువంశిక ధర్మకర్త కేంద్ర మంత్రి పి.అశోకగజపతిరాజు స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకురాగా దేవస్థానం ఈవో రామచంద్రమోహన్, అర్చక పరివారం తొలి దర్శనం చేయించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ ఇఎల్. నరసింహన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈయన వెంట రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పోలీసు కమిషనర్ యోగానంద్ ఉన్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున ఈవో సాంబశివరావు, వైదిక పరావారంతో కలిసి వచ్చి సింహాచవేశునికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. సుమారు పావుతక్కువ మూడు గంటలకు సాధారణ క్యూలో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి వరకు నిరాటంకగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. తెల్లవారుజామున ప్రోటోకాల్ సమయంలో వచ్చిన భక్తులు తీవ్ర గందరగోళాన్ని సృష్టించారు. వాస్తవానికి ప్రోటోకాల్ ప్రముఖుల్లో కొంతమంది తమ మందిమార్బలాన్ని వెంట తీసుకువచ్చారు. వీరిలో చాలా మంది టిక్కెట్లు లేనివారు కూడా ఉన్నారు. రాజగోపురం మార్గలో ఆలయంలోకి ప్రవేశించిన వీరి వలన కొంతమంది విఐపిలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెల్లవారు తొలి దర్శనానికి వచ్చిన అశోకగజపతిరాజు కుటుంబ సభ్యులతో పాటు అనేక మంది దేవాలయంలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో మొదలైన తాకిడి ఉదయం వరకు కొనసాగింది. ఈవో స్వయంగా రంగంలోకి దిగి నియంత్రించడంతో అంతా సద్దుమణిగింది. ఉదయం సాధారణంగా ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్ననాని పెరిగింది. ఈ క్రమంలో ఉచిత క్యూలు నిండిపోయి భక్తులు ఆరుబయట బారులు తీరాల్సి వచ్చింది. అంత వరకు చల్లగా ఉన్న వాతావరణ కాస్తా వేడెక్కింది. సూర్యభగవానుడు ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో ఆరుబయట బారులు తీరిన భక్తులు నానా అవస్థలు పడ్డారు. సుమారు రెండు గంటల పాటు భక్తులు మండుడెండలో విలవిలలాడారు. కాళ్లుకాలిపోయి, నెత్తిన ఎండమండిపోతుంటే భక్తులు పిల్లాపాపాలతో అవస్థలు పడ్డారు. క్యూలైన్లలో భక్తులను నడిపే ప్రక్రియ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. స్వచ్ఛంద సంస్థలు అందించే ప్రసాదాలకు, పానీయాలు అందుకోవడానికి భక్తులు ఆగిపోతుండడంతో క్యూలు వేగంగా కదలలేదు. ఫలితంగా భక్తులు క్యూలు దాటి బయట బారులు తీరి ఎండ దెబ్బకు బలికావలసి వచ్చింది. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న అధికారులు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నీడ ఏర్పాటు చేయడంతో పాటు కాళ్ళు కాలిపోకుండా తివాచీలు వేసి నీళ్ళు చల్లాడంతో భక్తులకు ఉపశమనం కలిగింది. తరువాత కొద్ది సేపటికే వాతావరణం చల్లబడిపోయింది.
* సేవలు కన్నా దర్శనాలకే ప్రాధాన్యతనిచ్చిన సేవకులు
చందనయాత్రకు తరలివచ్చే భక్తులకు సేవలందిస్తామని పెద్ద సంఖ్య ముందుకు వచ్చిన సేవకుల్లో కొన్ని సంస్థలకు చెందిన వారు స్వామివారి దర్శనాలకే అధిక ప్రాధాన్యత నిచ్చారు. ప్రత్యేక దర్శనం క్యూలలో వీరంతా పలుసార్లు దర్శనాలకు వెళ్ళారు. గతంతో పోలిస్తే స్వచ్ఛంద సంస్థల సేవలు దర్శనాలే లక్ష్యంగా సాగాయి.
* పారిశుద్ధ్యం పై అసంతృప్తి
పారిశుద్ధ్య నిర్వహణ పై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేసారు. ప్రధానంగా దేవాలయ దక్షణ గోపురం వద్ద బురదమయం కావడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. మరుగుదొడ్ల వద్ద భక్తులు ఇబ్బంది పడ్డారు. భక్తులు తిన్న ప్రసాదాల ప్లేట్లు, వాటర్ ప్యాకెట్ల కవర్‌లు రహదారంతా వెదజల్లడంతో అస్తవ్యస్తంగా తయారయింది. దేవస్థానం, జివియంసి అధికారులు సమన్వయంతో పనిచేయకపోవడంతో పారిశుద్ద్య సమస్య తలెత్తింది. కేశఖండనశాల వద్ద మధ్యాహ్నం నుండి కుళాయిలు పనిచేయలేదు.
* ఫలించిన ట్రాఫిక్ ప్రణాళికః చందనయాత్ర సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు అనుసరించిన ప్రణాళిక సత్ఫాలితానిచ్చింది. కొండ దిగువన ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాల నుండి బస్సు సదుపాయలతో పాటు ప్రధాన రహదారుల్లో సమయానుకూలంగా ట్రాఫిక్‌ని సరిచేయడంలో అధికారులు తీసుకున్న చర్యలు ఎక్కడా వాహనాల రాకపోకలకు అసౌకర్యకలగకుండా చేసాయి.
* దివ్యాంగులకు ప్రత్యేకం.. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన దివ్యాంగులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మాఢ వీధుల నుండి వీరిని వాహనాల్లో తీసుకువచ్చి అక్కడ నుండి లిఫ్ట్‌లో పైకి తీసకువెళ్ళి దర్శనం చేయించి తీసుకు వచ్చారు. గత ఏడాది కన్నా భక్తుల సంఖ్య తగ్గింది. ఉదయం నుండి భక్తుల రాక మందకొడిగానే సాగింది. సాయంత్రం నాలుగు గంటల నుండి ప్రోటోకాల్ ప్రముఖుల దర్శనాల సమయం నుండి భక్తుల రద్దీ పెరిగంది.
* సహస్రఘటాభిషేకం, చందనోత్సవంలో భాగంగా రాత్రి సహస్రఘటాభిషేకం జరిగింది. వందలాదిగా తరలివచ్చిన రుత్విక్కులు గంగధార నుండి కడవలతో జలాలను తీసుకురాగ దేవాలయంలో అర్చక పెద్దలు వరాహనారసింహుడి నిజరూపాన్ని అభిషేకించారు. 108 వెండి కలశలో ఉంచిన సుగంధ భరిత పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసారు.
* దర్శించుకున్న ప్రముఖులు
రాష్ట్ర పరిశ్రమల మంత్రి అమర్‌నాధ్‌రెడ్డి, హైకోర్టు జడ్జి నాగార్జునరెడ్డి, కర్నాటక హైకోర్టు జడ్జి నూతిరామ్మోహనరావు, స్టీల్‌ప్లాంట్ సిఎండి మధుసుధనరావు, సిని నటులు నాని, జయలలితోపాటు పలువరు రాజకీయ, అధికార అనధికార ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.