విశాఖపట్నం

ఇసుక అక్రమ రవాణా జరిగితే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 2: జిల్లాలో ఎక్కడైనా అనధికారికంగా ఇసుక అక్రమ రవాణా జరిగితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక అక్రమ రవాణాపై ఆర్డీవోలు, తహశీల్దార్లు, మైన్స్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్, పోలీసు, విజిలెన్స్, ట్రాన్స్‌పోర్టు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవలకాలంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి వారంలో ఒకరాత్రి తప్పనిసరిగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఎవరైనా మధ్యవర్తిత్వపు పనులు చేస్తున్నట్టు తనకి తెలిస్తే వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అనధికార ఇసుక అక్రమ రవాణా జరగకుండా అన్ని మండలాల్లో ఎంఆర్‌ఓ, ఎస్‌ఐ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్‌ఏఇలు, మైన్స్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి సమావేశాలను నిర్వహించాలన్నారు. వాటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలన్నారు. ఉచిత ఇసుక పాలసీ ఉన్నందున ప్రభుత్వ సంబంధిత కట్టడాలు సిసి రోడ్లు, గృహ నిర్మాణాలు, మరుగుదొడ్ల, అంగన్‌వాడీ భవనాలు, ఎన్‌ఆర్‌ఇజిఎస్ తదితర నిర్మాణాలకు మాత్రమే ఇసుకను ఉపయోగించాల్సి ఉందన్నారు. ఇసుకను ఎడ్లబళ్ళు, ట్రాక్టర్ల నుండి మాత్రమే రవాణా చేయాలన్నారు. మేజర్ పనులకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుండి ఇసుకను తీసుకోవాల్సింటుందన్నారు. ప్రైవేటు కట్టడాలకు ఉపయోంచినట్టు తెలిస్తే వారిపై చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు. వీరికి తహాశీల్దార్లు కూపన్లను ఇవ్వాలన్నారు. ఈ వాహనాలను నడిపే వారికి అనుమతి తప్పనిసరిగా ఉండాలని, సంబంధిత డాక్యుమెంట్ ఉండాలన్నారు. ప్రతి మండల తహశీల్దార్ కార్యాలయంలో రిజిష్టరు మెయింటెన్ చేయాలన్నారు. అనధికారికంగా నడిపే ట్రాక్టర్లు, లారీలను పట్టుకుని బైయింటింగ్ ఓవర్ చేయడం జరుగుతుందని, ఇదే పద్ధతిలో రెండు, మూడుసార్లు దొరికితే పిడి యాక్ట్ ప్రకారం వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. లోకల్ పోలీసులు కూడా ఆయా వాహనాలను సీజ్ చేసి కోర్టుకి అప్పగించాలన్నారు. ఆయా వాహనాలను సీజ్ చేసి కోర్టుకి అప్పగించాలన్నారు. తహశీల్దార్లు ఎప్పటికపుడు ఆకస్మిక తనిఖీలను చేపట్టాలన్నారు. వీరితోపాటు పంచాయతీ సెక్రటరీలు, విఆర్‌ఓలు కూడా తనిఖీలు చేయాలన్నారు. ఆర్డీఓలు ప్రతి వారం రెవెన్యూ డివిజన్ పరిధిలో సమావేశాలు పెట్టి సమీక్షించాలన్నారు. ఈ వేసవిలో ప్రభుత్వ నిర్మాణపనులు ఎక్కువుగా జరుగుతూ ఉంటాయికాబట్టి పర్యవేక్షించాలని గ్రామాలవారీగా విఆర్‌ఓల నుండి రిపోర్టులను తీసుకోవాలన్నారు. ట్రాక్టర్లకు సంబంధించి టాక్స్ కట్టాల్సి ఉంటుందని, వెహికల్ ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, భీమా ఉన్నవిలేనివి తనిఖీ చేయాలన్నారు.
ఈ సమావేశంలో డిటిసి వెంకటేశ్వరరావు, నర్సీపట్నం, అనకాపల్లి ఆర్డీవోలు సూర్యారావు, సూర్యకళ, మైన్స్ ఏడిలు చౌదరి, సూర్యచంద్రరావు, శివాజీ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇలు నాగేశ్వరరావు, మెహర్‌ప్రసాద్, ఎడిషనల్ ఎస్‌పి శ్రీకాంత్, స్పెషల్ బ్రాంచి ఎస్‌పి కిరణ్, గ్రౌండ్ వాటర్ డిడి శాస్ర్తీ, డిపిఓ కృష్ణకుమారి, తహశీల్దార్లు పాల్గొన్నారు.