విశాఖపట్నం

తాగి వాహనాలు నడిపిన 18 మందికి జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), మే 2: మద్యం సేవించి వాహనాలను నడిపిన 18మందికి జైలుశిక్ష, జరిమానాతో పాటు మరో 85మంది వాహన చోదకులకు మూడో మెట్రోపాలిటన్ న్యాయమూర్తి జరిమానా విధించారు. గాజువాక పోలీసు స్టేషన్ పరిధిలో వివిధ తేదీల్లో మద్యం సేవించి వాహనాలను నడిపిన 18మందిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని, మంగళవారం జిల్లా కోర్టులోని మూడో మెట్రోపాలిటన్ జడ్జి సిహెచ్.రమ్య ముందు హాజరు పరిచారు. వీరింతా గతంలో కూడ మద్యం సేవించి వాహనాలను నడిపి పోలీసులకు దొరికినట్టు గుర్తించిన ఆమె ఇందులోని ఒకరికి ఏడు రోజుల జైలుశిక్ష, మిగిలిన వారికి కేసు తీవ్రత బట్టి నాలుగు రోజులు, మూడు రోజులు, రెండు రోజులు చొప్పున జైలుశిక్ష విధించారు. దీంతో పాటు జరిమానా కూడ ఆమె విధించారు. వీరిని అడవివరంలోని కేంద్ర కారాగారానికి పోలీసులు తరలించారు.
అదే విధంగా మద్యం సేవించి గాజువాక పోలీసులకు చిక్కిన మరో 85మందికి జరిమానా విధించి, న్యాయమూర్తి వదిలేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అదనపు డిసిపి మహేంద్రపాత్రుడు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలను నడిపివారిని ఎట్టి పరిస్థితులలోను వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. మద్యం సేవించకుండ వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలను అరికట్టి పోలీసులతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బాహుబలి-2
హిందీ పైరసీ
* సెల్‌దుకాణాల్లో లోడ్ చేస్తున్న ఆరుగురి అరెస్టు
* కంప్యూటర్లు, పైరసీ డివిడిలు స్వాధీనం
విశాఖపట్నం(క్రైం), మే 2: ఇటీవల విడుదలైన బాహుబలి-2 సినిమా హింధీ పైరసీ డివిడిలతో తెలుగు కొత్త సినిమాల పైరసీ డివిడిలను తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి నుండి 189పైరసీ డివిడిలను, ఐదు కంప్యూటర్లను, పెన్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న బాహుబలి-2 సినిమాకు సంబందించిన పైరసీ డివిడిలు మార్కెట్‌లో చెలామణి ఆవుతున్నట్టు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. టాస్క్ఫోర్స్ ఎసిపి ఐ.చిట్టిబాబు ఆదేశాల మేరకు మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసులు సీతంపేటలో గల డివిడిల దుకాణంపై దాడి చేసి యజమాని సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకుని, అతని నుండి 189పైరసీ డివిడిలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొత్త సినిమాలతో పాటు బాహుబలి-2 హింధీ పైరసీ డివిడిలున్నట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. అదే విధంగా గాజువాక మెయిన్‌రోడ్డులో గల వివిధ సెల్ దుకాణాల్లో కంప్యూటర్ల సహాయంతో బాహుబలి-2 సినిమాను పెన్‌డ్రైవ్, మెమోరీ కార్డుల్లో లోడు చేస్తున్నట్టు గుర్తించిన టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం ఆయా దుకాణాలపై దాడులు చేశారు. ఐదు కంప్యూటర్లను స్వాధీనం చేసుకుని, కంప్యూటర్ ఆపరేటర్లు పి.సతీష్, కె.వెంకటేష్, పి.శివకుమార్, మహమ్మద్ సాహుల్‌ఫాషా, ఎస్.రమేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. కేసును గాజువాక పోలీసులకు టాస్క్ఫోర్స్ పోలీసులు అప్పగించారు.