విశాఖపట్నం

ఫలించిన ప్రచార వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మే 10, శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం, వియస్‌పిసిఎ (విశాఖ సొసైటీ ఫర్ యానిమల్ ప్రొటక్షన్ అండ్ కేర్ అసోసియేషన్) సంయుక్తంగా సింహాచలం దేవస్థానానికి మొక్కుల రూపంలో వస్తున్న కోడె దోడల నియంత్రణకు సంబంధించి చేసిన ప్రచార వ్యూహం సత్ఫలితాన్నిచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలి కాలంలో నిర్వహించిన ప్రచారం కారణంగా మొక్కుల రూపంలో సమర్పంచే కోడె దూడల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాది గంధం అమావాస్య, వైశాఖ పౌర్ణమితో పాటు పలు శనివారాల్లో వేలాదిగా వచ్చిన కోడె దూడలు సంఖ్య ఈసారి వందల్లోకి వచ్చింది. విజయనగరం, విశాఖజిల్లాలో ఇంకా ప్రచారానికి పూనుకోక పోవడంతో ఆ ప్రాంతాల నుండి బుధవారం అధిక సంఖ్యలో కోడె దూడలు మొక్కుల రూపంలో వచ్చాయి. భీమిలి, తగరపువలస ప్రాంతాల నుండి రైతులు కోడె దూడలను తీసుకు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. సింహాచలేశునికి మొక్కుబడులు రూపంలో వస్తున్న కోడె దూడల్లో అత్యధిక శాతం దేశీతర జాతులవే ఉంటున్నాయి. దేశీయ గోవులు అతి స్వల్పంగా భక్తులు సమర్పిస్తున్నారు. దేవస్థానం ఎంత ప్రచారం చేసిన లేగ దూడలు, అనారోగ్యం, అవయవలోపం ఉన్న గోవులను రైతులు వదిలి వెళ్ళడం మానడం లేదు. దీంతో దేవస్థానంతో పాటు వియస్‌పిసిఎ ప్రతినిధులు నానా యాతన పడుతున్నారు. ఆరో తేదీన లేగ దూడలను భక్తులు వదిలి వెళ్ళిపోయారు. ఈ దూడ అనారోగ్యంతో మృతిచెందింది. ఇటువంటి వాటిని రక్షించేందుకు వియస్‌పిసిఎ ప్రతినిధులు ఎంత ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. చివరకు చనిపోయిన దూడలను సంప్రదాయంగా ఖననం చేసారు. అవయవ లోపం ఉన్న కోడె దూడలను సంరక్షించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యం, అవయవలోపం, లేగ దూడలను వదిలి వెళ్ళి పోతున్నవారి చిరునామాలను తెలుసుకుని ఆయా మండలాల తాహశీల్దార్‌లకు లేఖ ద్వారా సమాచారం అందిస్తామని వియస్‌పిసిఎ ప్రతినిధి శ్రీదేవి తెలియజేసారు. దేశియేతర కోడె దూడలు, ఆనారోగ్య, అవయవలోప, లేగ దూడల సమర్పణను నివారించేందుకు ఉన్నతస్థాయిలో చర్యలు తీసుకుంటున్న దేవస్థానం, వియస్‌పిసిఎ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సింహాచలేశుని మెట్ల మార్గం వద్ద ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. వియస్‌పిసి ప్రతినిధి శ్రీదేవి రైతులు తెచ్చిన కోడె దూడలకు సంబంధించి ఒక రిజిస్టర్‌ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోడె దూడలకు సంబంధించిన వివరాలతో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్‌లకు నివేదిక సమర్పించడం జరుగుతుందని శ్రీదేవి చెప్పారు. లేగ దూడలు, అనారోగ్యం, అవయవలోపం ఉన్న గోవులను మొక్కుల రూపంలో చెల్లించడం వలన ఎదురవుతున్న ఇబ్బందులను తెలియజేస్తూ కలెక్టర్‌లకు నివేదిక అందజేస్తామని ఆమె తెలిపారు. గోవుల వివరాలకు సంబంధించిన రిజిస్టర్‌ను దేవస్థానం ఏఈవో ఎంవి.కృష్ణమాచార్యులు పరిశీలించారు. వియస్‌పిసిఎ ప్రతినిధి శ్రీదేవి ఏఈవోకి పరిస్థితి వివరించారు. విజయనగరం, విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. మొక్కుల రూపంలో సమర్పిస్తున్న గోవుల సంఖ్య తగ్గడం పట్ల దేవస్థానం సంతృప్తి వ్యక్తం చేస్తుంది. దేశీయేతర, అనారోగ్య, అవయవలోప, లేగ దూడలను సమర్పణ వలన ఎదురువుతున్న సమస్యల దృష్ట్యా రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి దేవస్థానం మరింత పగడ్బంది చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

సాంప్రదాయంగా రెండోవిడత గంధం సమర్పణ

సింహాచలం, మే 10, వైశాఖ పౌర్ణమి పర్వదినం సందర్భంగా బుధవారం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారికి రెండోవిడత గంధం సమర్పణ ప్రక్రియ సంప్రదాయంగా జరిగింది. మూడు మణుగుల సుగంధ భరిత శ్రీ చందనాన్ని సింహాచలేశునికి అర్చకులు సమర్పించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో అర్చకులు స్వామివారిని మేల్కొలిపారు. నాదస్వర వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి పూజలు నిర్వహించారు. పొత్తివస్త్రంతో పాటు స్వామివారికి అర్చక పెద్దలు గంధాన్ని సమర్పణ చేసారు. అనంతరం సింహాచలేశుని ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి వారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీగంధం ముద్దలను ఉత్సవమూర్తుల శిరస్సు, వక్షస్థలం, కరములకు అలంకరించారు.
* అన్నప్రసాదానికి విరాళం, శ్రీ సింహద్రినాధ నిత్యన్నప్రసాద పధకానికి భక్తులు రెండు లక్షల రూపాయలు విరాళంగా సమర్పించారు. మువ్వలవాని పాలెం ప్రాంతానికి చెందిన సిష్టా గంగరాజు అనే భక్తుడు లక్ష నూట పదహారు రూపాయలు, నగరానికి చెందిన కె.అప్పలనాయుడు అనే భక్తుడు లక్ష వెయ్యినూట పదహారు రూపాయలు విరాళంగా అందజేసారు. ఈ మేరకు భక్తులు దేవాలయ ఎఈవో ఆర్‌వివియస్.ప్రసాద్‌కి విరాళాన్ని అందజేసారు. దాతలకు విరాళం పత్రాలను అందజేసిన అధికారులు ప్రత్యేక దర్శన భాగ్యం కూడా కల్పించారు.