విశాఖపట్నం

విద్యార్థులు క్రీడాకారులుగా ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 15: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పిజివిఆర్ నాయుడు (గణబాబు) అన్నారు. జివిఎంసి స్వర్ణ్భారతి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు వేసవి శిక్షణ శిబిరాలు దోహదపడతాయని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల పట్ల కూడా అవగాహన పెంచుకోవాలని, ఆరోగ్య, మానసిక వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. ప్రతి సంవత్సరం ఇటువంటి శిబిరాలు నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. విశాఖ నగరం జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికగా ఆవిర్భవించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. జివిఎంసి కమిషనర్ హరినారాయణన్ మాట్లాడుతూ 46 క్రీడాంశాల్లో 20 రోజుల పాటు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. విశాఖ నగరంతో పాటు భీమునిపట్నం, అనకాపల్లి జోన్లలో కూడా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది 7,272 మంది విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. నగరంలోని వివిధ క్రీడా సంఘాలు, 250 మంది శిక్షకులు వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణలో పాలు పంచుకుంటున్నారన్నారు. ముందుగా విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. విద్యార్థులు కర్రసాము, రోలర్ స్కేటింగ్, కరాటే, తైక్వాండో వంటి క్రీడలను ప్రదర్శించారు. కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్ జివివిఎస్ మూర్తి, జివిఎంసి స్పోర్ట్స్ డైరెక్టర్ వై శ్రీనివాసరావు, పలువురు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

31 మందికి గ్రేడ్-2 హెచ్‌ఎంలుగా పదోన్నతులు
జగదాంబ, మే 15: జిల్లాలో జిల్లాప్రజాపరిషత్ యాజమాన్యానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో పనిచేస్తున్న 31 మంది ఉపాధ్యాయులకు గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కౌనె్సలింగ్ సోమవారం జెడ్‌పి సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కౌనె్సలింగ్ జెడ్‌పి చైర్‌పర్సన్ లాలం భవానీ ఆధ్వర్యంలో జరిపారు. జెడ్‌పి ముఖ్యకార్య నిర్వహణాధికారి జయప్రకాష్‌నారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి పాల్గొన్నారు. అయితే ఎపుడూ గందరగోళ పరిస్థితుల మధ్య కౌనె్సలింగ్ ప్రక్రియ ఈసారి ప్రశాంతవాతావరణంలో ముగిసింది.
ఇంటర్ పరీక్షల్లో ఒకరి డిబార్
జగదాంబ, మే 15: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షలకు 14,460 మంది జనరల్, 580 మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి 15,040 మంది హాజరుకావాల్సి ఉంది. కాగా జనరల్ అభ్యర్థుల్లో 706 మంది, ఒకేషనల్‌లో 53 మంది కలిపి 759 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలకు 13, 754 మంది జనరల్, 527 మంది ఒకేషనల్ కలిపి 14,281 మంది హాజరయ్యారు. ఏఎంజి జూనియర్ కాలేజీల్లో పరీక్ష రాసిన చుక్కా అప్పారావు మహాధ్యాయ కాపీయింగ్ చేస్తూ అధికారులకు పట్టుబడటంతో పరీక్షల నుంచి డిబార్ చేశారు. పరీక్షలను ఇంటర్‌బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి టి.నగేష్ తెలిపారు.