విశాఖపట్నం

రికార్డుల తారుమారుపై కదిలిన యంత్రాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 15: నగరంలో సంచలనం సృష్టించిన రెవెన్యూ రికార్డుల తారుమారు వ్యవహారంలో దిద్దుబాటుకు గురైన రికార్డులను ఆన్‌లైన్‌లో ఉంచి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. కొమ్మాది, మధురవాడ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భూములకు సంబంధించి కొంతమంది రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించిన సంగతి విధితమే. రెవెన్యూ రికార్డులకు కీలకమైన 1బి రికార్డులను తారుమారు చేసినట్టు ఫిర్యాదులు అందాయి. దాదాపు రూ.2,200 కోట్ల మేర ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులు తారు మారుచేసినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే అక్రమార్కులపై చర్యలకు శ్రీకారం చుట్టిన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సోమవారం నుంచి ఐదు రోజుల పాటు రికార్డులను పరిశీలించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. తొలి రోజు ఈ విభాగానికి ఆరు ఫిర్యాదులు అందాయి. తొలి రోజు అందిన ఫిర్యాదులన్నీ మధురవాడ ప్రాంతానికే చెందినవి కావడం గమనార్హం. సత్యనారాయణ రాజు అనే వ్యక్తి తనకు చెందిన 1.5 ఎకరాలకు సంబంధించిన రికార్డులు తారుమారు చేసినట్టు ఫిర్యాదు చేశారు. అలాగే మధురవాడలో విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) అప్రూవ్డ్ లేఅవుట్‌లో స్థలాలు కొనుగోలు చేసిన కొంతమంది కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సెల్‌కు వచ్చి అధికారుల వివరణ కోరారు. తాము కొనుగోలు చేసిన స్థలాలకు సంబంధించిన రికార్డులు కూడా తారుమారైనట్టు తెలిసిందని, విచారణ జరపాల్సిందిగా కోరారు. వీరి నుంచి ఫిర్యాదులు తీసుకున్న కలెక్టరేట్‌లోని ప్రత్యేక విభాగం అధికారులు పరిశీలన నిమిత్తం సంబంధిత విభాగాలకు పంపారు. మరో నాలుగు రోజులు సమయం ఉన్నందున మరికొంతమంది తమ డాక్యుమెంట్లతో వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలతో రికార్డులను ఆన్‌లైన్‌లో ఉంచామని, వీటిని పరిశీలించిన మీదట ఫిర్యాదుతో తమ వద్దకు వస్తే వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు.