విశాఖపట్నం

యోగాపై అవగాహనకు గీతం ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 20: ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. యూనివర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు సుమారు 300 మందితో జరిగిన ర్యాలీని గీతం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పోతరాజు ప్రారంభించారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె లక్ష్మీప్రసాద్, గీతం స్కూల్ ఆఫ్ గాంధియన్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ బి నళిని, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ కె రామకృష్ణారావు, గీతం ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. యోగా మార్గం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు శరీరం, మనస్సు అదుపులో ఉంటాయని రిజిస్ట్రార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. యువతలో ఏకాగ్రతను పెంచేందుకు ప్రాణాయామం అత్యుత్తమ మార్గమని తెలిపారు. విద్యార్థులు యోగా సాధన ద్వారా ఒత్తిడిని అధిగమించి విజయం సాధించాలన్నారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు యోగా ప్రాధాన్యత తెలిపే నినాదాలతో కూడిన ఫ్లకార్డులు ప్రదర్శించారు.

గీతం యూనివర్శిటీని సందర్శించిన ఐటి కమిషనర్

విశాఖపట్నం, జూన్ 20: ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ ఎస్‌వి ప్రసాద్ గీతం విశ్వవిద్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ గాంధియన్ స్టడీస్‌లో గీతం ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కె రామకృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గాంధీ మ్యూజియం, ధ్యాన మందిరం, యోగా కేంద్రాలను సందర్శించి గాంధీ ఆశయాలను ప్రచారం చేయడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ గాంధియన్ స్టడీస్ ప్రచురిస్తున్న గాంధి జర్నల్ ప్రతులను గీతం ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కె రామకృష్ణారావు, ఐటి కమిషనర్‌కు అందజేశారు. అనంతరం విశ్వవిద్యాలయంలోని సూపర్ కంప్యూటర్ సహ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కేంద్రం కేట్స్‌ను జిమ్‌సర్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను ఆయన సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని వౌలిక సదుపాయాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని అభినందించారు. కార్యక్రమంలో గీతం యూనివర్శిటీ ప్రో వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కె శివరామకృష్ణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం పోతరాజు, గవర్నింగ్ బాడీ సభ్యుడు శ్రీ భరత్ తదితరులు పాల్గొన్నారు.