విశాఖపట్నం

వైకాపా నగర అధ్యక్షునిగా తైనాల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడం, నాయకత్వ లోపం ఉన్న చోట, ప్రత్యామ్నాయాన్ని వెతకడం వంటి చర్యలకు పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉపక్రమించారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కో-ఆర్డినేటర్ల మార్పులు, చేర్పుల జాబితా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. విశాఖ జిల్లా విషయానికి వస్తే, విశాఖ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్షునిగా గుడివాడ అమర్‌నాథ్ వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఇది తలకు మించిన భారమే అవుతుంది. ఎందుకంటే, అధికార పార్టీ తన వద్ద ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించి ప్రతిపక్షాన్ని తొక్కేయడానికి ఓపక్క ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో అధికార పార్టీని ఎదుర్కొంటూ, వైకాపాను విజయం దిశగా నడిపించేందుకు ఇప్పుడున్న శక్తి సామర్థ్యాలు సరిపోవు. అందుకే అధికార వికేంద్రీకరణకు అథిష్ఠానం నడుంబిగించింది. అమర్‌నాథ్‌ను విశాఖ రూరల్ అధ్యక్షునిగా ఉంచి, అర్బన్‌కు కొత్త అధ్యక్షుని నియమించాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఈ అధ్యక్ష పదవిని గాజువాక నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా ఉన్న నాగిరెడ్డి, అదే నియోజకవర్గానికి చెందిన తిప్పల గురుమూర్తి రెడ్డి, ఉత్తర నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా నియమితులైన సత్తి రామకృష్ణారెడ్డి ఆశిస్తున్నారు. కో-ఆర్డినేటర్లుగా ఉన్న వారికి అదనంగా మరొక పదవి ఇవ్వకూడదని పార్టీ భావిస్తోంది.
ఇటీవల ఉత్తర నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పుకున్న తైనాల విజయకుమార్‌కు నగర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించాలని పార్టీలోని పలువురు కోరుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆయన జివిఎంసి కార్పొరేటర్‌గా పనిచేశారు. ఆ తరువాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ రెండు అనుభవాలను క్రోడీకరించి, రానున్న జివిఎంసి ఎన్నికల్లో పార్టీని విజయ పథం వైపు నడిపిస్తారన్నది పార్టీ వర్గాల ఆలోచన. ముఖ్యంగా జివిఎంసి ఎన్నికల్లో దాదాపూ 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం అంటే అంత తేలికైన పనికాదు. అనుభవం ఉన్న వ్యక్తి అవసరం. దీనికి తైనాల అయితే, సమర్థుడని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ వద్ద తైనాల పేరు పరిశీలనలో ఉందని తెలిసింది. జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఈ నియామకంపై నిర్ణయం తీసుకుంటారని భోగట్టా.