విశాఖపట్నం

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: మలేరియా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపా. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పూనం మాలకొండయ్య జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో కలసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో సీజనల్ ఉలు ప్రబలే అవకాశాలు ఎక్కువుగా ఉన్నందున వైద్య, ఆరోగ్యశాఖాధికారులను అప్రమత్తం చేశామన్నారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి పట్టణ, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో పటిష్టంగా అమలుపరుస్తున్నట్టు తెలిపారు. వ్యాధులు ఎక్కువుగా ప్రబలేందుకు అవకాశం ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలను నిర్వహించడంతోపాటు వ్యాధుల నియంత్రణకు ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ యాక్టివ్‌గా సర్వలెన్సు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. దోమల నివారణకు పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే రెండు విడతల్లో స్ప్రేయింగ్ కార్యక్రమాలను పూర్తిచేయడం జరిగిందన్నారు. గత ఏడాదిలో పోల్చుకుంటే ఈ ఏడాది మలేరియా కేసులు చాలా తక్కువుగా నమోదు అయ్యాయని, ఎటువంటి మరణాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆంత్రాక్స్ ప్రబలే అవకాశం ఉండే గ్రామాల్లో ఇప్పటికే 11 వేల యాంత్రాక్స్ వేక్సినేషన్లను వేయడం జరిగిందన్నారు. పశువుల సంచారాన్ని నియంత్రించడంతోపాటు యాంత్రాక్స్ ప్రబలకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. స్వైన్‌ఫ్లూ కేసులను ముందుగానే గుర్తించి వారికి సకాలంలో వైద్య సేవలు అందజేసేందుకు వైద్యాధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. అన్ని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులను కూడా అప్రమత్తంచేశామని, స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తుల వినియోగార్ధం ప్రత్యేకంగా వెంటిలేటర్లను సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ సీజనల్ వ్యాధుల విషయంలో ఎన్టీఆర్ వైద్యసేవ ఎంపానల్డు ఆసుపత్రులు అన్నింటినీ అప్రమత్తం చేసేందుకు ఈ నెల 27వ తేదీన వారితో సమావేశం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధిరి డాక్టర్ ఆర్.రమేష్, జివిఎంసి చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ హేమంత్‌కుమార్, జిల్లా మలేరియా అధికారి కుమార్, బయోలజిస్ట్ మణి తదితరులు టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.