విశాఖపట్నం

ఆర్కేబీచ్ వేదికగా పర్యాటక దసరావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: ప్రపంచ పర్యాటకన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27 నుంచి అక్టోబర్ 2 వరకూ పర్యాటక దసరావళి పేరిట ఉత్సవాలు నగర వాసులను అలరించనున్నాయి. ఆరు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సినీ తారలు సందడి చేయనున్నారు. దసరా పండుగ నాడు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, ప్రిన్స్ మహేష్ బాబు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. మిగిలిన రోజుల్లో నారా రోహిత్, రవితేజ వంటి మాస్ హీరోలు అలరించనున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి పర్యాటక ఉత్సవాల పోస్టర్‌ను స్థానిక ప్రభుత్వ అతిధిగృహంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్కేబీచ్ వేదికగా ఉత్సవాలు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహిస్తామన్నారు. ప్రకృతి అందాలతో అలరారే విశాఖ పర్యాటక ప్రాంతాలపై దేశ, విదేశాల్లోని పర్యాటకుల దృష్టిని ఆకర్షించే విధంగా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. సంబరాల్లో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలన్న సంకల్పతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు. దీనికోసం కోట్లాది రూపాయల ఖర్చుతో పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ దసరావళి ఉత్సవాల్లో విభిన్న తరహాలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి రోజు సినీ తారలతో అలరించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్టు వెల్లడించారు. విశాఖలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఇప్పటికే జిల్లాలో పలు పర్యాటక ప్రాజెక్టులు పూర్తి కాగా, మిగిలిన ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి కానున్నాయన్నారు. తొట్లకొండను రూ.3 కోట్లతోను, మధురవాడ అప్రోచ్‌రోడ్డును రూ.6 కోట్లతో, రుషికొండ బీచ్‌ను రూ.14.3 కోట్లతో డల్లపల్లి, సేఫ్ స్విమ్మింగ్ జోన్, బుద్ధిస్ట్ సర్కూట్ తదితర పర్యాటక ప్రాజెక్టులను రూ.166 కోట్లతో చేపట్టనున్నట్టు తెలిపారు. అరకు ఏకో టూరిజం, అరకు, పాడేరు ఫుడ్ కోర్టులు, ట్రైబల్ మ్యూజియం, టూరిజం రిసార్టులు, వంటి ప్రాజెక్టులు డిపిఆర్ దశలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పర్యాటక శాఖ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ శ్రీరాములు నాయుడు తదితరులు పాల్గొన్నారు.