విశాఖపట్నం

ఆసియా ఖండానికే ఆదర్శం అగ్రిటెక్ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: వ్యవసాయానికి సాంకేతికతను జోడించి సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ఏపి ప్రభుత్వం నిర్వహించిన అగ్రిటెక్ సదస్సు ఆసియా ఖండానికే ఆదర్శమని బిల్ అండ్ మిలిందా గేట్స్ సంస్థ చైర్మన్ బిల్‌గేట్స్ కొనియాడారు. విశాఖ నగరంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఏపి అగ్రిటెక్ సమ్మిట్-2017 ముగింపు సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన బిల్‌గేట్స్ మాట్లాడుతూ పౌర సేవల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున డిజిటల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారని కొనయాడారు. ఇదేతరహాలో వ్యవసాయం, ఆరోగ్యం, ఆర్థిక సంస్కరణల వంటి అంశాల్లో సాంకేతికతను జోడించి, సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు సిఎం చంద్రబాబు ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారని గేట్స్ కొనియాడారు. వ్యవసాయరంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బిల్‌గేట్స్ చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని అన్నారు. ఆహారపు అలవాట్లు మారుతున్న నేపథ్యంలో అందుకు అనువైన ఉత్పత్తులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కైజల్ యాప్‌ను ప్రభుత్వం పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నామని, ఇందుకు మైక్రోసాఫ్ట్ సంస్థకు ధన్యవాదాలు తెలియచేస్తున్నామని అన్నారు. ఈ సదస్సులో నిర్వహించిన ఫించ్ కాంపిటేషన్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన కిసాన్ నెట్‌వర్క్ ప్రతినిధులకు బిల్‌గేట్స్, చంద్రబాబు బహుమతి అందించారు. అలాగే ద్వితీయ, తృతీయ స్థానాలు సంపాదించిన వారికి కూడా బహుమతులు అందచేశారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.