విశాఖపట్నం

జోన్ ఇవ్వకుంటే..భిజెపిని విశ్వసించరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 11: విశాఖకు రైల్వే జోన్ ఇవ్వకుంటే, బిజెపి ఈ ప్రాంతావాసులు విశ్వసించరని ఎంపీ అవంతి శ్రీనివాసరావు అన్నారు. రైల్వే జోన్ అంశంపై సోమవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ విశాఖ ప్రజలు జోన్‌పై ఎన్నో ఆశలు పెంచుకున్నారని, జోన్ రాకపోతే ఇక్కడి ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని ఆయన అన్నారు. దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జించే వాల్తేరు డివిజన్‌ను అన్ని విధాలా చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి రైల్వే జోన్ ఇస్తామని చెప్పారని, దాన్ని విశాఖకు కేటాయించమని కోరుతున్నామని చెప్పారు. రైల్వే జోన్ కోసం శీతాకాల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నానని అవంతి చెప్పారు. జోన్ కోసం ఎంతటి త్యాగాలు చేయడానికైనా తాను వెనకాడనని అవంతి స్పష్టం చేశారు.

900 సంకర జాతి పాడిపశువుల కొనుగోలుకు రుణాలు

సబ్బవరం, డిసెంబర్ 11: జిల్లాలో గ్రామీణ రైతాంగం అత్యధిక పాల ఉత్పత్తిని సాధించేందుకు సంకరజాతి పశువుల కొనుగోలుకు ప్రభుత్వం 9 వందల యూనిట్లను మంజూరు చేసిందని జిల్లా పశుసంవర్థశాఖ ఉప సంచాలకులు డాక్టర్ పి.రామ్మోహనరావు తెలిపారు. సోమవారం ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక విలేఖర్లతోమాట్లాడారు. పాడి పశువుల కొనుగోలుకు గతంలో మాదిరిగా బ్యాంక్ లోను మీద ఆధారపడకుండా వివిధ కుల సంక్షేమ సంఘాల ద్వారా సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తామన్నారు. ఒక్కో రైతుకు రెండు పాడి పశువులను కొనుగోలు చేసేందుకు ఉద్థేశించిన ఈపథకంలో పాడి పశువుఒక్కొక్కటి కొనుగోలుకు 60వేల రూపాయలను ఖర్చుచేస్తారు. ఆ పశువు పాడి ఎండిపోయాక మరో పశువును రైతులు అందజేస్తారు. అయితే అత్యధిక పాల ఉత్పత్తిని ఇచ్చే పశువుల కొనుగోలుకోసం హర్యానా,మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు వెళ్ళేందుకు కార్పోరేషన్ అధికారి,రైతుతోపాటు తమ శాఖ తరపున పశువైద్యుడ్ని పంపిస్తున్నామన్నారు. ఆసక్తిగల రైతులు ఎస్సీ,బిసి, కాపు కార్పొరేషన్ల ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు పంపుకోవచ్చన్నారు. ఇవికాకుండా జిల్లాలో గొర్రెల పెంపకం దారుల సంఘాలు 170 ఉన్నాయన్నారు. వారి కోసం ప్రభుత్వం విత్తనం పొట్టేళ్ళు, 20 ఆడ గొర్రెలకు ఒక పొట్టేలు చొప్పున ఉచితంగా అందజేస్తుందన్నారు. రెండేళ్ళ తర్వాత మళ్ళీ వాటిని మార్చేసి వేరే రకాలను అందజేస్తున్నామన్నారు. ఒక్కో సంఘానికి 14 మంది సభ్యులు చొప్పున షీప్ సొసైటీల్లో ఉంటారన్నారు. సబ్బవరం మండలంలో ఇప్పటి వరకు కేవలం ఒక్క సొసైటీ మాత్రమే రిజిస్ట్రయిందన్నారు. నట్టల నివారణకు జిల్లాలో ఆరు లక్షల టీకాలు సిద్థం చేశామన్నారు. జిల్లాలో ప్రతీ 6 నెలల కొకసారి నిర్వహించే ఈ కార్యక్రమం వల్ల గొర్రెలు,మేకల్లో వచ్చే వైరస్‌ను నివారించవచ్చన్నారు. ఇవికాక రెయిన్‌ఫెడ్ ఏరియా గుర్తించిన ప్రభుత్వం గిరిజనులకోసం మరో 100 యూనిట్లను కొత్తగా మంజూరు చేసిందన్నారు.