విశాఖపట్నం

అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 17: మహిళలకు అవకాశం ఇస్తే, అద్భుతాలు సృష్టిస్తారు. మగవారికన్నా శ్రమకోర్చి పనిచేసి, ఉత్పత్తి సాధిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు రోజులపాటు విశాఖలో జరిగే అంతర్జాతీయ మహిళా పారిశ్రామిక సదస్సును ఆయన బుధవారం ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలంతా ఒకే గొడుగుకిందకు వచ్చి కార్యకలాపాలు సాగించడం ముదావహమని అన్నారు. శారీరక శ్రమతో కూడిన పనుల్లో మగవారు ఎక్కువగా రాణిస్తుంటే, ఐటీ వంటి రంగాల్లో మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని మరిన్ని పారిశ్రామిక విధానాలదను అమల్లోకి తెచ్చేందుకు సార్క్, డబ్ల్యుటీఓ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని అన్నారు. గత రెండేళ్లలో 11వేల కోట్ల రూపాయలను 24 వేల ఎంఎస్‌ఎంఈలకు కేటాయించామని చెప్పారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు విశాఖలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల వ్యాపార సాంకేతిక అభివృద్ధి కేంధ్రాన్ని ఏర్పాటు చేసేందుకు భారత మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య, దక్షిణ ఆసియా మహిళా అభివృద్ధి సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఆనందపురం మండలం గిడిజాలలో 50 ఎకరాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 200 పరిశ్రమల ఏర్పాటు చేసుకునేందుకు వీలుకల్పించారు. ఈ ఒప్పంద పత్రాలపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి సంతకం చేశారు.
సార్క్ దేశాల సెక్రటరీ జనరల్ అంజాద్ హుస్సేన్ మాట్లాడుతూ దక్షిణ ఆసియా దేశాల్లో మహిళా సాధికారతకు, మహిళా సామాజికాభివృద్ధికి తమ సంస్థ కృషి చేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర వర్తక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి బినోయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రం రూపొందించిన లాజిస్టిక్ పాలసీని ఏపీ అమల్లోకి తేవడం అభినందనీయమని అన్నారు. భారత మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షురాలు కె.రమాదేవి మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ సమాఖ్య కృషి చేస్తున్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీలు హరిబాబు, మురళీమోహన్, డబ్ల్యుటీఓ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రత్నాకర్, ఏపీ మహిళా పారిశ్రామికవేత్తల సంఘం అధ్యక్షురాలు జ్యోతిరావు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.