విశాఖపట్నం

21నుంచి ఉత్తరాంధ్ర వెనుకబాటుపై ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 16: రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అన్నింటా వెనుకబడి ఉపాది అవకాశాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారని ఉత్తరాంధ్ర హక్కుల సాధన సమితి గౌరవ అధ్యక్షుడు ఆచార్య కెఎస్ చలం పేర్కొన్నారు. విజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1969నాటికి వేదమిది ఎకరాలు మాయమైపోయి, నివాసితులకు తీవ్రంగా అన్యాయం జరిగిందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డి ప్రకారం (2014 స్థానికులకు 85శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ఈ పక్షపాత దోరణిపై అంతా ముక్తకంఠంతో ఉద్యమించి అనుకూల ఫలాలు సాధించుకోవాలన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ గత 90ఏళ్ళుగా ఏయులోకాని, శ్రీకాకుళంలోని అంబేద్కర్ వర్సిటీలోకానీ స్థానికేతరలు ఉద్యోగులు పొందారని, 85 శాతం ఉద్యోగ కల్పన ఇకపై అమలు చేయాలన్నారు. అలాగే రైల్వేజోన్ విశాఖ పరిదిని గుర్తించి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. విశాఖ జిల్లా అంటే విశాఖ నగరమే కాదని వెనుకబడిన ప్రాంతాలు మూడు జిల్లాల్లో ఉన్నాయన్నారు. చాపకిందనీరులా కేంద్రం ఈప్రాంతవాసుల హక్కుల్ని హరించే పధక రచన చేస్తుందని దానిని అడ్డుకోవాలన్నారు. జిల్లాకాని రాజకీయ నాయకులు ఉదాశీన ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. కన్వీనర్ డాక్టర్ పొన్నాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 21న కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామని, అనుకూల దోరణిరాకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర చైతన్యపార్టీ నేత రామునాయుడు, కె.చంద్రమోహన్, రొయ్య వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.