విశాఖపట్నం

ఆహార భద్రత అమలు ప్రభుత్వ బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మార్చి 15: పౌరులకు రాజ్యాంగ హక్కుగా ఉన్న ఆహార భద్రతను రాష్ట్ర ప్రభుత్వం పకడ్భందీగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ జె.ఆర్.పుష్పరాజ్ సూచించారు. స్థానిక కాఫీ హౌస్‌లో జాతీయ ఆహార భద్రత చట్టంపై గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని కూడా నిర్వహించి వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, డిజిటల్ లావాదేవీల రక్షణపై ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013వ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చిన జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతి నిరుపేద కుటుంభానికి పౌష్టికాహారాన్ని అందించడం ప్రభుత్వ విధిగా పేర్కొన్నారు. పౌరులందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చూడడం ప్రభుత్వ కనీస బాధ్యతగా ఆయన చెప్పారు. గిరిజన ప్రాంతాలలో పౌష్టికాహార లోపం అధికంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 5 లక్షల 81 వేల గిరజన కుటుంభాలకు గాను 4 లక్షల 81 వేల మందికి జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం అంత్యోదయ కార్డులను అందించి బియ్యం పంపిణీ చేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే మిగిలిన లక్ష గిరిజన కుటుంభాలకు కూడా అంత్యోదయ కార్డులను ఇవ్వాలని తమ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు ఆయన తెలిపారు. తమ కమిషన్ సిఫార్సుతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆయన చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న బియ్యాన్ని రీ-సైక్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తే రేషన్ డీలర్‌తో పాటు కార్డుదారులు, హోల్‌సేలర్, ఎగుమతి దారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసామని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతంలో జరుగుతున్న వారపు సంతల్లో కల్తీ ఆహార పదార్థాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని ఆయన చెప్పారు. గిరిజనులలో ప్రశ్నించే తత్వం వస్తే కల్తీ వస్తువులను అరికట్టవచ్చునని పుష్పరాజ్ అన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆహార, పౌర సరఫరాల శాఖ సంచాలకులు, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, రాష్ట్ర ఆహార కమిషన్ సభ్య కార్యదర్శి జి.రవిబాబు మాట్లాడుతూ వినియోగదారుల దినోత్సవాన్ని గిరిజన ప్రాంతాలలో జరుపుకుకోవడం శుభ పరిణామమని అన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం జిల్లా రెండో జాయింట్ కలెక్టర్ జిల్లా గ్రీవెన్స్ రీడ్రెసల్ అధికారిగా వ్యవహరిస్తారని, రేషన్ డీలర్లు సక్రమంగా సరుకులు పంపిణీ చేయకపోతే ఆయనకు పిర్యాదు చేయాలని చెప్పారు. జిల్లా, మండల స్థాయిలలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సదస్సులో పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని వారపు సంతలను ఆధునీకరించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐ.సి.డి.ఎస్. నిర్వహణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. ఈ సదస్సులో జిల్లా జాయింట్ కలెక్టర్ సిరి, పాడేరు సబ్ కలెక్టర్ డి.కె.బాలాజి, ఆహార కమిషన్ సభ్యులు ఎల్.బి.వెంకటరావు, విజయకుమార్, జి.క్రిష్ణమ్మ, స్వర్ణగీత, శ్రీనివాసరావు, మాజీ మంత్రి, మహిళా కమిషన్ సభ్యురాలు మత్స్యరాస మణికుమారి, ఏజెన్సీలోని పదకొండు మండలాల అధికారులు పాల్గొన్నారు.