విశాఖపట్నం

ఆర్డీఓ కోర్టుకి సింహాచలం ఇనాం భూముల వ్యవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 25: సింహాచలం ఇనాం భూముల వ్యవహరాన్ని ఆర్డీఓ కోర్టులో విచారణ జరపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పంచ గ్రామాల ప్రజానీకం నుంచి వినతులు స్వీకరించి వెంటనే విచారణ ప్రారంభించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన, ఇన్‌ఛార్జి ఆర్డీఓ గోవిందరాజులు, ఇతర అధికారులతో ప్రభుత్వ అతిధిగృహంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింహాచలం భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇదే అంశంపై విశాఖలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే భూములకు సంబంధించిన పలు వివాదాలు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నందును ఇప్పటి వరకూ సమస్యకు పరిష్కారం తీసుకురాలేకపోయామన్నారు. సింహాచలం ఇనాం భూములకు సంబంధించి ఇటీవలే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చ చేస్తూ స్థానిక ఆర్డీఓ కోర్టులో సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించిందన్నారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా తక్షణమే విచారణ చేపట్టి సమ్యకు మంచి పరిష్కారం చూపాల్సిందిగా ఆర్డీఓ గోవిందరాజులును మంత్రి గంటా ఆదేశించారు. భూ వివాదాలపై సానుకూల ధోరణిలో విచారణ జరిపి చట్టబద్ధంగా రైతులకు న్యాయం చేయాలని సూచించారు.
ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారి పనుల ప్రగతిని సమీక్షిస్తూ భూ సేకరణ, రైతులకు నష్టపరిహారం చెల్లింపు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారి నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. గ్రామాలతో జాతీయ రహదారిని అనుసంధానం చేసే క్రమంలో తీసుకుంటున్న నిర్ణయాలు తెలపాలని పద్మనాభం మండలం నుంచి పాల్గొన్న ప్రజా ప్రతినిధులు మంత్రి గంటాను కోరారు. అవసరమైన గ్రామాలకు ప్రధాన జంక్షన్లకు అనుసంధాన రోడ్లు, బ్రిడ్జిలు ప్రతిపాదించకుండా రహదారి డిజైన్‌ను ఎలా ఖరారు చేస్తారని మంత్రి అధికారులను నిలదీశారు. ప్రత్యేకంగా రేవిడి-పద్మనాభం రోడ్డులోని మహారాజుపేట టీ జంక్షన్, 21 గ్రామాలకు ప్రధాన కేంద్రమని, అటువంటి జంక్షన్‌లో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదించాలని అధికారులను ఆదేశించారు. నష్టపరిహారం విషయంలో కొంతమంది రైతులు అసంతృప్తితో ఉన్నారని, పరిహారాన్ని పెంచే అంశాన్ని పరిశీలించాలని జేసీకి సూచించారు. భీమిలి నియోగజకవర్గ పరిధిలోని గిడిజాల, ఏవీ పాలెం, వేములవలస, వెల్లంకి గ్రామాల్లో ఎన్‌టీఆర్ గృహాల నిర్మాణానికి అవసరమైన భూముల కేటాయింపులో ఎందుకు ఆలస్యం జరుగుతోందని స్థానిక తహశీల్దారుపై మంత్రి గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతాంశమైన గృహ నిర్మాణ పథకాలకు కాకుండా, డిడ్‌కో, ఏపీఐఐసీలకు భూములు కేటాయించడంపై మంత్రి మండిపడ్డారు. లబ్దిదారుల ఎంపిక కూడా పూర్తయిన నేపథ్యంలో తక్షణమే భూములు కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణ పనులు తక్షణమే చేపట్టాలని హౌసింగ్ పీడీని మంత్రి ఆదేశించారు.