విశాఖపట్నం

వుడా పీఆర్‌ఓగా జానకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 18: విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) పౌర సంబంధాల అధికారిగా జానకమ్మ నియమితులు కానున్నారు. వుడా తరపున పౌర సంబంధాల వ్యవహారాలు చూసేందుకు అర్హులైన ఉద్యోగి కోసం వీసీ బసంత్ కుమార్ పౌరసంబంధాల శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. పౌర సంబంధాల శాఖ నుంచి సానుకూల స్పందన లభించింది. విశాఖ పౌర సంబంధాల విభాగంలో సహాయ పౌర సంబంధాల అధికారి (ఏపీఆర్‌ఓ)గా బాధ్యతలు నిర్వహిస్తున్న జానకమ్మను డిప్యూటేషన్‌పై వుడాకు పంపేందుకు సమాచార శాఖ కమిషనర్ నుంచి అమోదం లభించింది. ఈ విషయాన్ని వుడా వీసీ బసంత్ కుమార్ సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల ఆమోదం అనంతరం జానకమ్మ వుడా పీఆర్‌ఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయనగరం జిల్లా పౌర సంబంధాల శాఖలో సహాయ పౌర సంబంధాల అధికారిగా పనిచేసిన జానకమ్మ బదిలీపై విశాఖ వచ్చారు.