విశాఖపట్నం

ఎన్నికలు ముందే రావచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 18: అసెంబ్లీ, పార్లమెంట్‌కు ముందుగానే ఎన్నికలు జరిగే సూచనలు కన్పిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ చివర్లో జరగాల్సిన ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించే అవకాశాలున్నాయి. ఇప్పటి నుంచి కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి పిలుపునిచ్చారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, స్నేహమిత్రల శిక్షణ కార్యక్రమం ఉత్తరాంధ్ర పార్టీ శిక్షణ శిబిరాల ఇన్‌ఛార్జి కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో కార్యాలయంలో సోమవారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న మూర్తి మాట్లాడుతూ గడువుకు ముందుగానే ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో టీడీపీ ఎన్నికలకు సిద్ధం అవుతోందన్నారు. ఎన్నికలప్పుడు అభ్యర్థి ఎంపిక జరుగుతుందని, ఇప్పటి నుంచి అభ్యర్థి ఎవరన్న అంశంపై చర్చను పక్కనపెట్టి గెలుపు అంశాలపై దృష్టి సారించాలన్నారు. అభ్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థి బలాబలాపై టీడీపీ అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. గెలుపొందే అభ్యర్థినే బరిలోకి దించుతారని, అభ్యర్థికి అండగా నిలిచి గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. మీరు నమ్ముకున్న టీడీపీకి రక్షణగా నిలవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకెళ్లాలన్నారు. కర్తవ్య నిర్వహణలో మీరు ముందుండాలని, వెనుకబడితే నష్టపోతామన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీలో కార్యకర్తలు కూడా క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. పార్టీ శిక్షణ శిబిరాల డైరెక్టర్, పోలుదాసు కృష్ణమూర్తి మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి అవలంభిస్తున్న విధానాలను వివరించారు. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ సేవామిత్ర శిక్షణ తరగతులు వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని బూత్ కన్వీనర్లు, సేవామిత్రలు పాల్గొన్నారు.