విశాఖపట్నం

పౌర విమానాలకు ఇబ్బంది కలిగించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 21: విశాఖ విమానాశ్రయానికి వచ్చే పౌర విమానాల రాకపోకలకు ఎటువంటి విఘాతం కలుగకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేవీ అధికారులకు సూచించారు. నవంబర్ ఒకటో తేదీ నుంచి పౌర విమాన రాకపోకలపై నేవీ ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విశాఖ విమానాశ్రయంలో నేవీ అధికారులతో చర్చించారు. నేవీ సిబ్బంది శిక్షణ నిమిత్తం విమానాలను నిలిపివేయాల్సి వస్తోందని నేవీ అధికారులు చెప్పారు. ఈ విమానాశ్రయం నుంచి ఒకవైపే విమానాల టేకాఫ్, ల్యాండింగ్ తీసుకోవడం వలన విమానాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని అన్నారు. ప్రస్తుత రన్‌వేకు ప్రత్యామ్నాయ రన్ వే నిర్మిస్తే, సమస్య వెంటనే పరిష్కారమవుతుందని నేవీ అధికారులు, విశాఖ ఎయిర్ ట్రావల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఇందుకు కోసం పోర్టుటకు చెందిన 50 ఎకరాల భూమి కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. వెంటనే సీఎం స్పందిస్తూ ఆ 50 ఎకరాల భూమిని వెంటనే నేవీకి ఇవ్వాలని సూచించారు. రన్‌వే నిర్మాణానికి ఎంత సమయం పడుందని చంద్రబాబు ప్రశ్నిస్తే, మూడు సంవత్సరాలు పడుతుందని నేవీ అధికారులు బదులిచ్చారు. ఎనిమిది నెలల్లో పూర్తి చేయచ్చని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ చెప్పారు. ఈ రన్ వే నిర్మాణం ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. విశాఖ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడితే, పర్యాటకుల సంఖ్య తగ్గిపోతుందని చంద్రబాబు నేవీ అధికారులకు చెప్పారు. పోర్టు రోడ్డులోని టోల్ గేటు రుసుము రెట్టింపు చేసిన విషయాన్ని కూడా ఎమ్మెల్యే గణబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ వెంటనే ఈ ధరలను తగ్గించాలని పోర్టు చైర్మన్ కృష్ణబాబును ఆదేశించారు. ఇందుకు కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డు వస్తాయని, అయినా, తాను ఉన్నతాధికారులతో మాట్లాడతానని కృష్ణబాబు సీఎంకు చెప్పారు.