విశాఖపట్నం

మరో రెండు రోజులు బడులకు సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, జూన్ 21: ఎండల తీవ్రత నేపథ్యంలో పాఠశాలలకు మరో రెండు రోజులు సెలవుప్రకటించారు. ఇప్పటికే ఈ నెల 21 వరకూ పాఠశాలకు సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల సెలవు అనంతరం ఈ నెల 25న తిరిగి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ రెండు రోజుల పాటు నగరంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు తెరవకూడదని, నిబంధనలు పాటించకుండా పాఠశాలలు తెరిస్తే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు.

అమృత వేలీ ప్రకృతి చికిత్స కేంద్రం ప్రారంభం

విశాఖపట్నం, జూన్ 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య పునరావాస పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న అమృతవేలీ ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. రుషికొండలో ఏపీ హెల్త్ ఫెస్టివల్‌లో పాల్గొన్న సందర్భంగా అక్కడే అమృతవేలీ ప్రాజెక్టు నిమిత్తం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వైద్య ఆరోగ్యశాఖ, ఆయుష్ సంస్థలు సంయుక్తంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో అమృత వేలీ ప్రాజెక్టును చేపట్టారు. పలు రకాల వైద్య సేవలతో పాటు ప్రకృతివైద్య చికిత్స, పంచకర్మ , స్పా తదితర చికిత్సా విధానాలను ఇక్కడ అందుబాటులోకి తెస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బాల సురక్ష వాహనాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపీ కె హరిబాబు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, పంచకర్ల రమేష్‌బాబు, కిడార సర్వేశ్వర రావు, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఆయుష్ కమిషనర్ పీఏ శోభ, ఎపీఎంఎస్‌ఐడీసీ సీఎండీ గోపీనాద్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.