విశాఖపట్నం

ఆగిన లారీ చక్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 20: డిమాండ్ల సాధన కోసం ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా లారీ యజమానులు, వర్కర్లు తలపెట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం ప్రారంభమైంది. జిల్లాలోని 24 యూనియన్లకు గాను 22 యూనియన్లు సమ్మెలో పాల్గొన్నాయి. అత్యవసర సర్వీసులై మంచినీరు, పాలు సరఫరా చేసే లారీలకు సమ్మె నుంచి మినహాయింపు నిచ్చారు. జిల్లాలో అన్ని యూనియన్ల నుంచి సుమారు 20వేల లారీలు రోడ్డెక్కలేదు. డిమాండ్లు పరిష్కరించేంత వరకూ సమ్మె విరమించేది లేదంటూ లారీ ఓనర్లు, వర్కర్లు భీష్మించుకున్నారు. లారీల సమ్మె ప్రారంభమైన తొలి రోజు పెద్దగా ప్రభావం కన్పించలేదు. ముఖ్యంగా సరుకు రవాణాకు సంబంధించి శుక్రవారం నుంచి లారీలు నిలిచిపోవడంతో రెండు రోజుల తరువాత దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని యంత్రాంగం భావిస్తోంది. ఇప్పటికే జిల్లాలో నిత్యావసర సరుకుల రవాణాకు సంబంధించి యంత్రాంగ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆర్టీసీ సరుకు రవాణా వాహనాల్లో అనుకున్న మేరకు ఇది సాధ్యం కానప్పటికీ కొంతమేర ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా నిత్యావసర సరుకుల రవాణాకు సంబంధించి శుక్రవారం ఒక్క లారీ కూడా నగరంలో తిరగలేదు. జ్ఞానాపురం కూరగాయల మార్కెట్‌కు ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన సరుకు దిగుమతి కాలేదు.