విశాఖపట్నం

బిగుసుకుంటున్న ఉచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఆగస్టు 17: కేజీహెచ్‌లో 300 మంది చిన్నారులపై 3క్లినికల్ ట్రయల్స్2 చేసారంటే నిజమనే చెప్పాలి. ఎందుకుటే ఎటువంటి అనుమతులు లేకుండానే కేజీహెచ్ వైద్యులు పలు ప్రైవేట్ కంపెనీలతో మందస్తు ఒప్పందం చేసుకొని పిల్లలపై ప్రయోగాలు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. కేజీహెచ్ పీడియాట్రిక్ విభాగంలో అధిక సంఖ్యలో కొంత మంది అటు ఎథిక్స్ కమిటీ, ఇటు రోగి అనుమతి లేకుండానే ప్రయోగాలు చేసి ఆ ప్రయోగం కాస్త వికటించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విజయనగరానికి చెందిన రామారావు అనే వ్యక్తి వైద్యం నిమిత్తం కేజీహెచ్‌కు వచ్చాడు. రామారావుకు క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నట్లు చెప్పకుండానే ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన మందును ప్రయోగించడంతో చికిత్స పొందుతునే మరణించారు. దీంతో ఆయా ప్రయోగం చేస్తున్న వైద్యులు వాస్తవానికి ఎథిక్స్ కమిటీకి సమాచారం అందించాలి. కానీ అటువంటి చర్యలు చేపట్టకపోవడంతో పాటు, రోగి మరిణించిన తరువాత పదే పదే విచారణ చేపట్టడం, మరణించిన రామారావుకు సంబంధించి పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకపోవడంతో అనుమానం కలిగిన కుటుంబసభ్యులు విచారణ చేపట్టడంతో పాటు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టిన ఎథిక్స్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కూటికుప్పల సుర్యారావు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించారు. అంతేకాకుండా ఈ నెల 11న కేజీహెచ్‌లోని వైద్యులతో కలసి ఎథిక్స్ కమిటీ సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమయంలో మరణించిన రోగికి ఎథిక్స్ కమిటీ సభ్యుల సూచన మేరకు 27లక్షల రూపాయలు అందించాలని ఓ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మరణించిన రోగికి న్యాయం చేసే విధంగా ఇన్సురెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే కేవలం ఎటువంటి అనుమతి లేకుండా వైద్యులు ప్రయోగం చేపట్టడంతో ఆయా రోగి పోస్టుమార్టం ఇచ్చే విషయంలో కూడా దాదాపుగా రెండు నెలల సమయం ఎందుకు జరిగిందిని ఎథిక్స్ కమిటీ ఆరా తీసింది. దీంతో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్న వైద్యులు అనుమతి లేకుండా చేసిన విషయం బయటకు రావడంతో ఎథిక్స్ కమిటీ గడిచిన ఐదు సంవత్సరాలుగా ఎంత మందికి క్లినికల్ ట్రయల్స్ చేశారు? అనే విషయాలపై ఆరా తీస్తోంది. విశేషం ఏమిటంటే ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్‌తో మరణించిన రోగికి 2016నుంచే అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.
* రెండు నెలల నుంచి
అనుమతులు రద్దు
కేజీహెచ్‌లో పీడీయాట్రిక్ విభాగంతో పాటు ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, తదితర విభాగాలలో ఇటువంటి ప్రయోగాలు చేపట్టేందుకు పలువురు వైద్యులు తహతహలాడుతున్న పూర్తి స్థాయిలో నిబంధనలు పాటించని కారణంగా ఎథిక్స్ కమిటీ ఎటువంటి ప్రయోగాలు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వలేనట్టు తెలుస్తోంది. అయితే గతంలో కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కళాశాలకు సంబంధించి వేర్వేరుగా కమిటీలు ఉండేవి. కానీ ఇటీవల ఒకే కమిటీని 16 మందితో నియమించడంతో పాటు ఆయా కమిటీ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
* నిజనిర్ధారణ కమిటీకి ఆదేశించిన ఎంపీ
కేజీహెచ్‌లో పీడీయాట్రిక్ విభాగంలో చోటుచేసుకున్న సంఘటన నేపధ్యంలో స్పందించిన విశాఖ ఎంపీ హరిబాబు ఎథిక్స్ కమిటీ సభ్యులతో శుక్రవారం అత్యవసర సమావేశమైయ్యారు. అసలు ఏ కేజీహెచ్‌లో జరుగుతున్న వ్యవహరాలపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించే విధంగా నిజనిర్థారణ కమిటీని నియమించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
* సెలవులో వెళ్లిన సూపరిండింటెంట్
కేజీహెచ్ పీడీయాట్రిక్ విభాగంలో ఘటన విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరిండింటెంట్ డాక్టర్ అర్జున్ సెలవులో వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కేజీహెచ్‌లో ఎంత మంది వైద్యులు ఈ తరహ క్లినికల్‌ట్రయల్స్ చేస్తున్నారు? తదితర వాటి వివరాలపై ఇప్పటికే ఎథిక్స్ కమిటీ ఆరా తీయనుంది.