విశాఖపట్నం

మత్స్యకారులను రక్షించిన కోస్ట్‌గార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: దయే తుపానుకు ముందు సముద్రంలో వేటకు వెళ్లి చిక్కుకున్న మత్స్యకారులను ఇండియన్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది రక్షించారు. ఈ నెల 20న ఒడిశాకు చెందిన మత్స్యకారులు రెండు బోట్లపై సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. వీరంతా దయా తుపానులో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కోస్ట్‌గార్డ్ సిబ్బంది రక్షించారు. వీరందరినీ ఈ నెల 21న పారదీప్ పోర్టుకు సురక్షితంగా చేర్చారు. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకూ ఇండియన్ కోస్ట్‌గార్డ్ విభాగం 63 రక్షణ కార్యక్రమాల్లో 102 మంది ప్రాణాలు కాపాడారు. విపత్తు సమయాల్లో కోస్ట్‌గార్డ్ విభాగం పెద్ద ఎత్తున రక్షణ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.