విశాఖపట్నం

రూ.46 కోట్లతో నీరు చెట్టు పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 17: వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా రూ.46 కోట్లతో పనులు చేపట్టనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. నగరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రూ.38 కోట్లతో 456 చెరువుల్లో పూడికతీత పనులను, మరో రూ.8 కోట్లతో 789 చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లాలో రూ.72 కోట్లతో 682 ఇరిగేషన్ చెరువుల్లో మట్టి పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు. జిల్లాలో 20వేల పంట కుంటలను తవ్వేందుకు నిర్ణయించగా, ఇప్పటికే 3000 కుంటలను తవ్వినట్టు తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం కింద రూ.135 కోట్లతో 1275 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టామన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో 2.35 లక్షల మంది కూలీలకు పని కల్పించామన్నారు.
కరవు పరిస్థితుల నేపథ్యంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. బోర్ల మరమ్మతులు, కొత్త బోర్ల ఏర్పాటు విషయంలో యాక్షన్ ప్లాన్ మేరకు చర్యలు తీసుకున్నామన్నారు.