విశాఖపట్నం

స్వైన్‌ప్లూపై అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, నవంబర్ 12: జిల్లాలో స్వైన్‌ప్లూ కేసుల సంఖ్య రోజురోజికి పెరుగుతున్నాయి. రోజికి సగటున మూడు పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. దీని నివారణకు తక్షణమే చర్యలు తీసుకుండి.గ్రామాల్లో విస్తృతప్రచారం కల్పించి వ్యాధి తీవ్రతను తగ్గిలా చూడలంటూ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సోమవారం స్వైన్‌ప్లూ మరణాలు, తీసుకొవాల్సిన జాగ్రత్తలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో స్వైన్‌ప్లూ వ్యాధి లక్షణాలతో ఎవరైనా ఆసుపత్రులకు వచ్చినట్లయితే, రిపోర్ట్ వచ్చేంతవరకు ఆగకుండా వెంటనే స్వైన్‌ప్లూకి సంబంధించిన వైద్యాన్ని ప్రారంభించాలన్నారు. స్వైన్‌ప్లూ రోగులతో సంబంధం ఉన్న వారి కుటంబ సభ్యులకు కూడా ముందస్తుగా వైద్యం అందించాలన్నారు. నగరంలో చాలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులకు అందించే చికిత్సల విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయని, వారంతా కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే రోగులను వారి అడుగుతే తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యసేవల కోసం పంపాలని, ఆఖరి నిమిషం వరకూ ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకొవాలన్నారు.అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు టామీప్లూ టాబ్లెట్‌లను పంపిణీ చేశామని,అవసరమైతే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఆ టాబ్లెట్ పొందవచ్చుని ప్రైవేట్ ఆసుపత్రి ప్రతినిధులకు సూచించారు. స్టీల్‌ప్లాంట్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో స్వైన్‌ప్లూ కేసులు ఎక్కువుగా రిపోర్ట్ అవుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వ,ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ఆయా పరిశ్రమలకు చెందిన ఆసుపత్రి వైద్యులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూ, చికిన్‌గున్యా, తదితర వ్యాధులపై జరుగుతున్న సర్వెలెన్స్‌ను కొనసాగించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుపతిరావు, జీవీ ఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ హేమంత్‌ను ఆదేశించారు. స్వైన్‌ప్లూపై అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన, ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుపతిరావు,కేజీహెచ్ సూపరిండింటెంట్ డాక్టర్ అర్జున్, టీబీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సాంబశివరావు,డిసీహెచ్ నాయక్, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు.

జిల్లా ప్రోగ్రామ్ మేనేజింగ్ ఆఫీసర్‌గా డాక్టర్ శ్రీ్ధర్ నియామకం
జగదాంబ,నవంబర్ 12: వైద్య ఆరోగ్యశాఖలో చేపడుతున్న సంక్షేమ పథకాల నిర్వహాణ, వాటి పనితీరును పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన జిల్లాప్రోగ్రామ్ మేనేజింగ్ ఆఫీసర్ పోస్టును ఎట్టకేలకు భర్తీ చేశారు. డిఎంహెచ్‌వో కార్యాలయంలో ఇన్‌చార్జి డెమోగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీ్ధర్‌ను నియమిస్తు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారలు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇటీవల ఈ పోస్టులో పనిచేసిన వైద్యురాలు డాక్టర్ దేవికి విజయవాడ బదిలీ కావడంతో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులో శ్రీ్ధర్‌ను నియమించారు. డాక్టర్ శ్రీ్ధర్ నియామకం పట్ల ఎన్‌ఆర్‌హెచ్‌ఎం విభాగ ఉద్యోగులతో పాటు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఉద్యోగులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.