విశాఖపట్నం

వాలీబాల్ అటాకింగ్ మిషన్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 12: విశాఖపట్నం స్పోర్ట్స్ అధారిటీ వాలీబాల్ సెంటర్‌లో ఎక్యూ అటాకింగ్ మిషన్ ప్రారంభమైంది. పోర్టు స్టేడియం శాయ్ సెంటర్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో శరత్‌చంద్ర ఎక్యూ మిషన్‌ను రూపొందించి ఉచితంగా అకాడమీకి అందజేశారు. జిల్లా వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, శాసనసభ్యుడు పి.జి.వి.ఆర్. నాయుడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాలీబాల్ అటాకింగ్ మిషిన్‌ను ప్రారంభించారు. ఆధునాతనంగా రూపొందించిన ఈ మిషిన్ వాలీబాల్ క్రీడలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, స్పైకింగ్, సర్వీసింగ్‌ను వరుస బంతుల్లో ఉపయోగించడం ఈ మిషిన్ ప్రధాన ప్రయోజనమని గణబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో శాయ్ సెంటర్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు, కోచ్‌లు సత్యనారాయణ, రమణ, ఒలింపియన్ ఎం.వి. మాణిక్యాలు, పోర్టు స్టేడియం ఇన్‌చార్జి నాగబూషణం, కబడ్డీ కోచ్ నాగేశ్వరరావు, డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.

న్యుమోనియాపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి
* ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ చాఫ్టర్ అధ్యక్షుడు రాజశేఖర్
జగదాంబ, నవంబర్ 12: న్యుమోనియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలిగి ఉండటంతో సకాలంలో వ్యాధి నుంచి బయటపడవచ్చునని ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ విశాఖ చాఫ్టర్ అధ్యక్షుడు డాక్టర్ బి.రాజశేఖర్ అన్నారు. అంతర్జాతీయ న్యుమోనియా దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని, దీనిలో భాగంగానే సోమవారం విలేఖరుల సమావేశం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారులలో అధిక శాతం మరణాలకు కారణమవుతున్న న్యుమోనియా వ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన ఎంతో అవసరమన్నారు. చిన్న వయస్సులోనే వ్యాధిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్న యునివర్శిల్ ఇమ్యునైజేషన్‌లో భాగంగా న్యుమోనికోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అందిస్తుందని, త్వరలోనే ఏపీలో కూడా అందించనున్నారన్నారు. చాఫ్టర్ కార్యదర్శి డాక్టర్ ఆరిశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ చిన్నారుల్లో న్యుమోనియా వ్యాధి మరిన్ని ప్రాణాలను బలి తీసుకోకుండా ఆపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రుల్లో న్యుమోనియా వ్యాధిపై పూర్తి స్థాయిలో అవగాహన ఎంతో అవసరమన్నారు.గ్రామీణ స్థాయిలో సరైన అవగాహన లేని కారణంగా మరణాల సంఖ్య పెరుగుతున్నాయన్నారు.ప్రస్తుతం దేశంలో ప్రతీ రెండు నిమిషాలకో చిన్నారి మృత్యువాత పడడానికి న్యుమోనియా కారణమవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రవికిరణ్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ కెవి రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.