విశాఖపట్నం

ఆటాపాటలతో పాఠాలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 15: విద్యా విధానంలో సరికొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సులభశైలిలో ప్రపంచ విజ్ఞానాన్ని పొందే విధంగాను, విద్యలో మేటిగా ఎదిగేందుకు వీలుగా ఇది అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే ప్రపంచదేశాల్లో అనేకచోట్ల అమలవుతోన్న సరికొత్త విద్యావిధానం తొలిసారిగా ఏపీలో అడుగు పెట్టనుంది. దీనికి ఎడ్యుటెక్-2018 వేదికగా నిలిచింది. పలు దేశాల్లో అక్కడ అమలవుతోన్న విద్యా విధానం, ఇందులో మెళుకవలు, ప్రపంచ విజ్ఞానాన్ని ఏ విధంగా అందివ్వాలి? కేవలం విద్యనభ్యసించడంతోనే కాకుండా ఏఏ దేశాల్లో ఎటువంటి తరహాలో దీనిని అందిస్తున్నారు? భవిష్యత్‌లో విద్యాపరమైన సవాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది? గతంలో కంటే కూడా ఇందులో చోటుచేసుకుంటున్న విప్లవాత్మకమైన మార్పులు తదిర అంశాలకు సంబందించి ఏర్పడిన స్టాళ్లు విజ్ఞానాన్ని పెంచేవిగా నిలిచాయి. * ఆటపాటలతోనే విదేశీ విద్య
విద్య విధానాన్ని సరళీకృతం చేయడంతోపాటు సులభ పద్ధతిలో విద్యనభ్యసించే విధానాన్ని పలు దేశాలు అమలు చేస్తున్నాయి. ఇందులో పిన్‌ల్యాండ్ సరికొత్త విద్యావిధానంతో చక్కటి ఫలితాలు సాధించడంతోపాటు ప్రపంచ విజ్ఞానాన్ని పొందగలుగుతోంది. పిన్‌ల్యాండ్‌లో వీడియోగేమ్స్ ద్వారా విద్యార్థుల్లో సత్ప్రవర్తన, నేర్చుకునే స్థాయి, తరగతి గదుల్లో బోధనాఅంశాలు, బోధనా పరికరాలపట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉండే విధంగా ఇవి ఉంటాయి. ఇందులో వరల్డ్ ఫేమజ్ గేమ్స్‌తో కూడిన బోధన, టాప్-క్లాస్ గేమ్స్, పాఠాల ప్రణాళికలు, లెర్నింగ్ అనాలిటిక్స్ తదితర అంశాలపై విద్యా విధానం అమలవుతోంది.
* డిజిజల్ దిశ పేరుతో విద్యా విదానం
పాఠశాల విద్య మరింత సులభతరం కానుంది. డిజిటల్ దిశ పేరుతో సరికొత్త విద్యా విధానం అమల్లోకి తీసుకువచ్చేందుకు వీలుగా డిజిటల్ ఎడ్యుకేషన్ అమల్లోకి రానుంది. పాఠశాల విద్యకు సంబంధించి డిజిటల్ ఆడ్బాబ్‌తో సత్సంబంధం ఏర్పర్చుకుంటున్నాం. రెండు లక్షల మంది పిల్లలకు ఏడు వేల మంది బోధకులతో 500 స్కూళ్ళల్లో డిజిటిల్ విధానం అమలుకానుంది. విద్యా పరికరాలను ఉపయోగించుకోవడం, డిజిటల్ టీచింగ్, ఆన్‌లైన్‌లో చదవడం వంటివి ఇందులో ముఖ్యాంశాలుగా చెప్పవచ్చు.

ఏపీఈపీడీసీఎల్‌కు మూడు జాతీయ అవార్డులు
* ఓవరాల్ విన్నర్‌గా ఏపీఈపీడీసీఎల్ * సంస్థకు ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు
విశాఖపట్నం, నవంబర్ 15: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సిగలో మరో మూడు జాతీయ అవార్డులు చేరాయి. జాతీయ స్థాయిలో ఏపీఈపీడీసీఎల్ రెండవ స్థానంలో గ్రీస్ గ్రిడ్ అవార్డును అందుకుంది. అలాగే విద్యుత్ రంగంలో పనితీరు మెరుగుదల అంశంలో ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్‌లు కలిసి సంయుక్తంగా జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాయి. అంతేకాకుండా ఏపీఈపీడీసీఎల్ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు ఓవరాల్ విన్నర్‌గా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈ నెల 13, 14 తేదీల్లో రెండు రోజులపాటు 3క్లీన్ ఎనర్జీ ఇన్ ఎవెరి హోమ్2 అంశంపై 12వ భారత ఇంధన సదస్సు-2018 జరిగింది. ఈ సదస్సులో భాగంగా ఇంధన రంగంలో వివిధ అంశాల్లో విశేష ప్రతిభ కనబరచిన సంస్థలకు అవార్డులను ప్రధాన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఏపీఈపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర తరపున చీఫ్ జనరల్ మేనేజర్ వి.విజయలలిత ఛాంబర్ ఆఫ్ కామర్స్ జ్యూరీ ప్యానెల్ సభ్యుల చేతులమీదుగా ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా సిఎండి హెచ్‌వై దొర మాట్లాడుతూ కేంద్రం ఇంధన మంత్రిత్వశాఖ, రాష్ట్ర ఇంధన శాఖల ఆదేశాలకు అనుగుణంగా డిస్కామ్‌లో పలు రకాల పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామన్నారు. సంస్థ ఉద్యోగుల సమిష్టి కృషి కారణంగానే సంస్థకు జాతీయ స్థాయిలో అవార్డులు లభించాయన్నారు. ఈ అవార్డుల స్ఫూర్తితో వినియోగదారులకు మెరుగైన సేవలందించి ఏపీఈపీడీసీఎల్‌ను మరింత అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు కృషి చేస్తామన్నారు. జాతీయస్థాయిలో డిస్కామ్‌కు అవార్డులు లభించడం పట్ల సంస్థ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

18న యాదవ వధూవరుల పరిచయ వేదిక
విశాఖపట్నం (కల్చరల్), నవంబర్ 15: విశాఖ జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన యాదవ వధూవరుల పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్టు వివాహ సంబంధ పర్యవేక్షణ కమిటి ప్రతినిధి పి.రమేష్ పేర్కొన్నారు. గురువారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివాజీపాలెంలోని సవేరా ఫంక్షన్ హాలులో ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ఉంటుందని రాష్ట్రం నలుమూలల నుంచి యాదవ కులస్తులు విచ్చేసి లబ్ధిపొందాలన్నారు. సంఘ ప్రతినిధి ఉప్పిలి అప్పలకొండ మాట్లాడుతూ పాల్గొనేందుకు ఎలాంటి రుసుములు లేవని, అందరికీ అల్పాహారం, భోజన వసతులు ఏర్పాటు చేశామన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన యదవ ప్రముఖుల్ని సత్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నమ్మి నాగేశ్వరరావు, నమ్మి వెంకట్, పీ.వెంకటరమణ పాల్గొన్నారు.