విశాఖపట్నం

పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయండి:మంత్రి గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురవాడ, నవంబర్ 16: సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి గడువులోగా పూర్తిస్థాయిలో సభ్యులను చేర్పించాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి, భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. శుక్రవారం మహావిశాఖ 4వ వార్డు పరిధిలోని డిఆర్‌కె లేఅవుట్‌లో సభ్యత్వ నమోదు, వార్డు దర్శిని కార్యక్రమాలపై స్థానిక నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటి అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, అనుబంధ కమిటీలతో మంత్రి గంటా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వార్డులో 57,991మంది సభ్యత్వ నమోదు లక్ష్యం కాగా ఇప్పటికి కేవలం 1875మందిని సభ్యులుగా చేర్చడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. డిసెంబర్ నెలకల్లా లక్ష్యం పూర్తిచేయాలని నాయకులకు మంత్రి ఆదేశించారు. అవసరమైతే తాను కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటానని మంత్రి తెలిపారు. అలాగే వార్డు దర్శిని కార్యక్రమం సక్రమంగా జరగడంలేదని దాన్ని సమర్ధవంతగా నిర్వహించవలసిన అధికారులు సరిగా హాజరు కాకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. వార్డు దర్శిని కార్యక్రమం నిర్వహించే రోజు ముందురోజు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు తెలియపర్చాలని జోన్1 జడ్సీకి ఆదేశించారు. వార్డు దర్శిని కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరుకావాలని మంత్రి ఆదేశించారు. వార్డు దర్శినిలో వచ్చిన సమస్యలను ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా పరిష్కరించాలని మంత్రి అధికారులకు తెలిపారు. సమావేశంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.