విశాఖపట్నం

ఈఎన్‌సీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 16: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేవల్ డాక్‌యార్డ్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. నేవల్ డాక్‌యార్డ్ సూపరింటెండెంట్ రియర్ అడ్మిరల్ అమిత్ బోస్ ముఖ్యఅతిధిగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నేవల్ డాక్‌యార్డ్‌కు చెందిన డిఫెన్స్, సివిల్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తం దానం చేశారు. రికార్డు స్థాయిలో 628 యూనిట్ల రక్తాన్ని సేకరించి కేజీహెచ్, ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్, ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టులకు అందజేశారు. ఈ సందర్భంగా కేజీహెచ్ బ్లడ్‌బ్యాంక్ విభాగాధిపతి డక్టర్ కే శ్యామలాదేవి మాట్లాడుతూ దేశంలో రక్తం కొరత తీవ్రంగా ఉందన్నారు. రక్తదానం పట్ల ప్రజల్లో విస్తృత ప్రచారం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి సంవత్సరానికి మూడు,నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చన్నారు. ఒక వ్యక్తి రక్తదానం చేస్తే నలుగురు వ్యక్తుల ప్రాణాలు కాపాడినట్టేనని పేర్కొన్నారు. నౌకాదళ సిబ్బంది తీసుకున్న చొరవతో పలువురికి ప్రాణదానం చేసినట్టేనని పేర్కొన్నారు. ఏఎస్ రాజా వాలంటరీ బ్లడ్ బ్యాంక్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఏ సుగంధి, ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టు బ్లడ్‌బ్యాంక్ ప్రతినిధి డాక్టర్ వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

ఐఎన్‌ఎస్ డేగాలో విద్యార్థులు

విశాఖపట్నం, నవంబర్ 16: నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని నౌకాదళ యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు, ఎయిర్ స్టేషన్‌లో విద్యార్థులను అనుమతించారు. మూడు రోజుల పాటు ఐఎన్‌ఎస్ డేగాలో ఈ ప్రదర్శనకు విద్యార్థులను అనుమతిస్తారు. భారతదేశ రక్షణలో నౌకాదళం పాత్ర, యుద్ధ విమానాల పనితీరు, వాటి సేవలపై నౌకాదళ ప్రతినిధులు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు సావధానంగా సమాదానాలిచ్చారు. హెలెన్ కెల్లర్ తదితర విద్యా సంస్థల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.