విశాఖపట్నం

శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవార్ని దర్శించుకున్న ప్రభుత్వచీఫ్ సెక్రటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్), జనవరి 17: నగరంలోని బురుజుపేటలో వెలసిన శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారిని గురువారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ మన్మోహన్‌సింగ్ అమ్మవార్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయల ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో నగర క్రైం డీసీపీ దామోదర్ అమ్మవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా నాయడుతోటకు చెందిన కలర్ ఇండియా పెయింటింగ్ ఇండస్ట్రీస్ ప్రతినిధి అజ్ఞాత భక్తుడు లక్ష రూపాయల నిత్యాన్నదాన కార్యక్రమాన్ని విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహాణాధికారిణి ఎస్‌జె మాధవి, ఏఇఓ వీ.మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రాబాప్టిస్ట్ చర్చిలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి
విశాఖపట్నం (కల్చరల్), జనవరి 17: నగరంలో వన్‌టౌన్ ఏరియాలో ఉన్న ఆంధ్రాబాపిస్టు చర్చిలో ఇటీవల జరిగిన ఎన్నికలు చెల్లవని తిరిగి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చర్చి వైస్-చైర్మన్ ఆర్.ఈశ్వరరావు తెలిపారు. గురువారం చర్చి సభ్యులతో కలిసి వీజెఎఫ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన చర్చి చైర్మన్ ఇతర పదవులకు జరిగిన ఎన్నికల్లో బెన్నిబాబు వర్గం రౌడీయిజం చేసి ఎన్నికల్లో గెలుపొందారన్నారు. చర్చి సభ్యులగా దాదాపుగా 700 మంది ఉన్నప్పటికీ అధికంగా సభ్యుల కానీ వారు ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. 50శాతం ఓట్లు బయట నుంచి వచ్చి వేసినవేనన్నారు. ఎన్నికల అధికారులు అయిన ఈశ్వరరావు, దయామణిలను బెదిరించి కౌంటింగ్‌కు అంతరాయం కలిగించారన్నారు. ఎన్నికల అధికారులు ప్రకటించకుండా బన్నిబాబు తమకు తామే చైర్మన్‌గా ప్రకటించుకోవడం దారుణమన్నారు. ఈ ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారులను కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు ధనలక్ష్మి, బిల్డింగ్ కమిటీ కన్వీనర్ ఏ.శ్యామ్‌సుందర్, కార్యదర్శి ఎస్.విజయబాబు, సీహెచ్.తాతబాబు, ఎం.డేవిడ్ పాల్గొన్నారు.