విశాఖపట్నం

రక్షణ రంగాలకు వర్సిటీ సంపూర్ణ సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 17: రక్షణ రంగాలకు అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందించడానికి ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని ఏయూ వీసీ ఆచార్య జీ.నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఏయూ కంప్యూటర్స్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగంలో రక్షణ రంగాల ఉద్యోగులకు నిర్వహిస్తున్న స్వల్పకాలిక సైబర్ సెక్యూరిటీ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా విశ్వవిద్యాలయం పనిచేస్తోందన్నారు. పరిశోధన, కన్సల్టెన్సీ, కోర్సుల నిర్వహణ దిశగా ఏయూ రక్షణ రంగాలతో కలసి పనిచేస్తోందన్నారు. ఎంటెక్‌లో సైబర్ సెక్యూరిటీ కోర్సును ఏయూ నిర్వహిస్తోందన్నారు. రక్షణశాఖ సంయుక్త కార్యదర్శి హరిప్రసాద్ మాట్లాడుతూ రక్షణ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత గౌరవ జీవనాన్ని అందించే దిశగా ఈ కోర్సులు ఉపకరిస్తాయన్నారు. భవిష్యత్‌లో మరిన్ని కోర్సులు రానున్నాయన్నారు. ఎన్‌సీసీ కల్నల్ అమిత్‌శర్మ మాట్లాడుతూ రక్షణ రంగాల ఉద్యోగులకు సైబర్ సెక్యూరిటీ కోర్సు ఎంతో ఉపయుక్తమన్నారు. సమాచారాన్ని సంరక్షించుకోవడం ఎంతో అవసరమన్నారు. పటిష్ట రక్షణ వ్యవస్థలను తాము వినియోగించడం జరుగుతుందన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్షణ రంగాల ఉద్యోగులకు ఉపయుక్తంగా కోర్సులను రూపకల్పన చేసి అందించడం జరుగుతోందన్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాలలో రక్షణ రంగాల ఉద్యోగులకు ఉపయుక్తంగా వివిధ కోర్సులను నిర్వహించడం జరుగుతోందన్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం పటిష్టంగం, వెయ్యిమందికి పైగా విద్యార్థులను కలిగి ఉందన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి ఆచార్య కూడ నాగేశ్వరరావు, విభాగ ఆచార్యులు వల్లీకుమారి తదితరులు పాల్గొన్నారు.

ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు కల్నల్ హోదా
* గెజిట్ విడుదల చేసిన భారత ప్రభుత్వం

విశాఖపట్నం, జనవరి 17: ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జీ.నాగేశ్వరరావు కల్నల్ హోదాను పొందారు. నేషనల్ క్యాడెట్ కార్స్న్ విభాగంలో గౌరవ హోదాలో ఆయనను కల్నల్‌గా నియమించారు. ఇటీవల భారత ప్రభుత్వం ఈ మేరకు గెజిట్ ఉత్తర్వులను విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆచార్య జీ.నాగేశ్వరరావు ఒక్కరికే ఈ గౌరవం దక్కింది. విశ్వవిద్యాలయానికి కల్నల్ కమాండెంట్‌గా వ్యవహరిస్తారు.