విశాఖపట్నం

రాజకీయ సాధికారత కోసం పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 20: మహిళలు రాజకీయ సాధికారత కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి అనీ రాజా పిలుపునిచ్చారు. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ 20వ జాతీయ మహాసభలు విశాఖలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నగరంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ నూతన ఆర్థిక విధానాల ఫలితంగా ఆర్థిక అసమానతలు పెరిగి, మహిళలు, పిల్లలపై జీవితాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. మహిళలపై పలు రూపాల్లో హింస, దాడులు పెచ్చుమీరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలను తగ్గిస్తామంటూ మహిళలను మోసపుచ్చి అధికారం దక్కించుకున్న ప్రభుత్వాలు హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. తనకు అపార అనుభవం ఉందన్న ప్రధాని నరేంద్ర మోదీ ధరలను నియంత్రించలేక చతికిలపడ్డారన్నారు. విపక్షంలో ఉండగా మహిళా బిల్లును పలు సందర్భాల్లో ప్రస్తావించిన బిజెపి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో సంపూర్ణ మెజార్టీ కలిగిన మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మహిళా బిల్లును తక్షణమే ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని డిమాండ్ చేశారు. హిందూ రాజ్యస్థాపన ధ్యేయంగా మోదీ సర్కారు పనిచేస్తోందని ఆరోపించారు.