విశాఖపట్నం

చిగురిస్తున్న ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 30: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులను కాదని, మహరాష్ట్ర నుంచి మరో కేంద్ర మంత్రిని తీసుకువచ్చి ఎపి నుంచి రాజ్యసభకు పంపడం వెనుక బిజెపి, టిడిపి రాజకీయ వ్యూహం ఉందని భావిస్తున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికే కర్నాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరినీ కాదని మహరాష్టక్రు చెందిన రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఎపి నుంచి రాజ్యసభకు పంపడం వెనుక మిత్రపక్షాలు రెండూ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు ప్రచారం జరుగుతోంది. విభజన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, సహా రైల్వే జోన్ తదితర హామీలపై ఇప్పటికే విపక్షాలు, ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న బిజెపి, తెలుగుదేశం పార్టీలు, ఒక్క సారిగా విపక్షాలకు చెక్ చెప్పేందుకు ఈ ఎంపిక ఉపకరిస్తుందని భావిస్తున్నారు. విభజన హామీ రైల్వే జోన్ ఏర్పాటు ఎలాగూ తప్పదు కనుక దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు యత్నిస్తోంది. రైల్వేజోన్ అంశం తేల్చాల్సిన సమయం ఆసన్నమైన తరుణంలో అది విపక్షాల ఉద్యమాల ఫలితంగానే అనే భావన తుడిచిపెట్టాలంటే ఎలాగూ మిత్రపక్షానికి ఇచ్చే రాజ్యసభ సీటును రైల్వే మంత్రికే కేటాయించి, తమ ఖాతాలో వేసుకునే విధంగా పథకానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. మరో మూడు, నాలుగు నెలల్లో జివిఎంసికి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు జివిఎంసి ఎన్నికలే లక్ష్యంగా ఉద్యమాలు చేస్తూ, రాజకీయ ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. హోదా, రైల్వే జోన్ అంశాలతో వెనకబడిన బిజెపి, తెలుగుదేశం పార్టీలు జివిఎంసి ఎన్నికల్లో విజయం సాధించాలంటే తామే చేస్తున్నామనే భ్రమలు కల్పించాల్సి ఉంది. ఇక్కడే బిజెపి, తెలుగుదేశం పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరించి, రైల్వేమంత్రినే రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపేలా నిర్ణయం తీసుకున్నాయి. రాజ్యసభకు రాష్ట్రం నుంచి పంపినందుకు కృతజ్ఞతగా రైల్వే మంత్రి జోన్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం రెండు పార్టీలకు కలసి వస్తుందన్న భావన. జివిఎంసి ఎన్నికలకు ముందే రైల్వేజోన్ విషయంలో ఏదో ఒక ప్రకటన చేసి, చేయగలిగేది తామే అన్న అంశాన్ని ప్రజల్లో ప్రచారం చేయాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. రాజకీయ పార్టీలు వూహిస్తున్నట్టు జరిగితే సురేష్‌ప్రభు రాజ్యసభకు ఎన్నికైన తర్వాత, జివిఎంసి ఎన్నికలకు ముందు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదని విశే్లషకుల భావనగా తెలుస్తోంది. బిజెపి, తెలుగుదేశం వ్యూహం ఏదైనప్పటికీ రాజ్యసభకు అవకాశం ఇచ్చిన తెలుగు ప్రజల ఆకాంక్ష మేరకు రైల్వేజోన్ ప్రకటిస్తే అంతకంటే కావాల్సిందేముంది.