విశాఖపట్నం

బిజెపి విజయోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 30: ప్రధాని మోదీ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్టు హరిబాబు తెలిపారు. విశాఖతో పాటు తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, అనంతపురం, విజయవాడ తదితర ప్రాంతాల్లో జరిగే విజయోత్సవ సభల్లో స్మృతి ఇరానీ, మనోహర్ పారికర్, ప్రకాష్ జవదేకర్, ఉమా భారతి, ధర్మేంద్ర ప్రధాన్, రవి శంకర్ ప్రసాద్, పాల్గొంటారని తెలిపారు. విశాఖలో జరిగే సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పాల్గొంటారన్నారు. విశాఖలో అరుణ్‌జైట్లీ సమావేశం ఈ నెల 15న జరిగే అవకాశం ఉందన్నారు. ఇక రెండేళ్ల పాలనలో నవ్యాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న వాటితో పాటు అదనంగా మరిన్ని విద్యా సంస్థలను ఆంధ్రకు కేటాయించామన్నారు. ఇప్పటికే 11 విద్యా సంస్థలను కేటాయించగా, 9 విద్యా సంస్థలు మంజూరయ్యాయని, వీటిలో కొన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలు కూడా జరుగుతున్నాయన్నారు. అలాగే చట్టంలో లేని నైపర్ యూనివర్శిటీ, పెట్రోలియం యూనివర్శిటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్‌ట్రేడ్, ప్యాకేజీ యూనివర్శిటీలను కేంద్రం మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ పూర్తి స్థాయిలో బలోపేతం చేయడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. గతంలో రెండు లక్షలు దాటని బిజెపి సభ్యత్వాలు 25 లక్షలకు చేరాయని, ఇది మోదీ పాలనపై ప్రజలకు గల నమ్మకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, బిజెపిలు మిత్రపక్షాలుగా ఉన్నాయని, ఇక మీదట కూడా ఇదే మైత్రి కొనసాగుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రైల్వే మంత్రి సురేష్‌ప్రభుకు రాజ్యసభకు అవకాశం కల్పించిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు రాష్ట్రం నుంచి ఎన్నికైతే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించడంలో తోడ్పడుతుందన్నారు. అలాగే హోదా తదితర అంశాలపై కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే ఉందని తెలిపారు.