విశాఖపట్నం

విద్యుత్ వినియోగదారుల బిల్లింగ్ తేదీల్లో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 30: గరిష్ట స్థాయి విద్యుత్ వినియోగదారుల విద్యుత్ వినియోగ గణన, బిల్లింగ్ ప్రక్రియల్లో సమూల మార్పులు తీసుకురావాలని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) యాజమాన్యం నిర్ణయించింది. మరింతగా పారదర్శకతతో కూడిన సేవలందించడం, జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో భాగంగా ప్రతి నెలాఖరున నిర్వహిస్తున్న విద్యుత్ బిల్లింగ్ విధానంలో మార్పులు తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఇక నుంచి ప్రతినెల నాలుగవ తేదీ నుంచి 11 వరకు జరుపుతున్నట్టు సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ రేవు ముత్యాలరాజు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గరిష్ట స్థాయి విద్యుత్ వినియోగదారుల విద్యుత్ వినియోగ గణన, బిల్లింగ్ ప్రక్రియలో మరింత శాస్ర్తియత ఉండేలా మార్పులు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుత విధానంలో విద్యుత్ వినియోగాన్ని లెక్కించి, బిల్లులు జారీ చేయడంతో నిర్ణీత కాల వ్యవధి కాకుండా ఆలస్యం కావడం, ఒక నెలలో ఒకసారి, మరో నెలలో ఇంకోసారిగా వేర్వేరు తేదీల్లో ఈ ప్రక్రియ సాగుతుండటం వల్ల విద్యుత్ వినియోగ గణనలో తేడాలు కనిపిస్తున్నాయన్నారు. విద్యుత్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో విద్యుత్ వినియోగ గణన, బిల్లుల జారీ ప్రక్రియలో శాస్ర్తియత దిశగా కొన్ని మార్గ దర్శకాలను సూచించడం జరిగిందన్నారు. ఈ మేరకు రెండు మాసాలకోసారి బిల్లుల విధానాన్ని నెలకోసారిగా, అలాగే కనిష్ట స్థాయి వినియోగదారుల బిల్లింగ్‌ను ఆన్‌లైన్ చేయడం ఇప్పటికే జరిగిందన్నారు. ఇపుడు తాజాగా గరిష్ట స్థాయి వినియోగదారులకు అదే నెలలో విద్యుత్ వినియోగ గణన, బిల్లుల జారీకి సంబంధించి మెరుగైన మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. ఇందులోభాగంగా ప్రస్తుతం ప్రతినెల 21వ తేదీ నుంచి 26 తేదీల మధ్య బిల్లింగ్ జరుగుతుండగా, ఆ నిర్ణీత తేదీలను ముందుకు జరుపుతూ ఇకపై ప్రతినెలా 4 నుంచి 11 తేదీల మధ్య బిల్లింగ్ చేయాలని నిర్ణయించామన్నారు. ఈ మార్పు వచ్చే జూన్ నుంచే అమల్లోకి వస్తుందని, జూన్‌లో 4-11 తేదీల మధ్యనే రీడింగ్, బిల్లింగ్ చేస్తామన్నారు. ఈ మార్పుకు వినియోగదారులు సహకరించాలన్నారు.