విశాఖపట్నం

జూన్ 6 నుంచి శిక్షణ కార్యక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (విశాఖపట్నం) ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా నిరుద్యోగ అభ్యర్థులకు జూన్ 6వ తేదీ నుంచి 10 వరకు ఫినిషింగ్ స్కిల్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో అయిదు రోజుల పాటు విశాఖపట్నం నందు కేటాయించిన కాలేజీల్లో శిక్షణనిచ్చి, శిక్షణ అనంతరం జాబ్ మేళా నిర్వహించబడునని సంస్థ అసోసియేట్ మేనేజర్ పిబి సాయిశ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆసక్తి గల అభ్యర్థులు హెచ్‌టిటిపి/ఏపీఎస్‌ఎస్‌డిసి.ఇన్ వెబ్‌సైట్ లైదా ఏపీఎస్‌ఎస్‌డిసి ఏపీపీనందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా సూచించారు. లేదా జాబ్‌మేళావైజాగ్.ఏపీఎస్‌ఎస్‌డిసియటదారేటాప్‌జిమెయిల్.కామ్‌కు మెయిన్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. శిక్షణానంతరం జూన్ 11వ తేదీ నుంచి 14వరకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రిజమ్ డిగ్రీ, పిజి కాలేజ్, రాజేంద్రనగర్, ద్వారకానగర్, విశాఖపట్నంనందు కింద తెలిపిన ఉద్యోగాల కోసం జాబ్‌మేళా నిర్వహించబడునన్నారు. ఈ జాబ్ మేళాకు నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఫ్రెషర్స్, 2015లో డిగ్రీ పూర్తి చేసుకున్న వారు అర్హులుగా పేర్కొన్నారు. హాజరయ్యే కంపెనీల వివరాలను తెలియజేశారు. డబ్ల్యూఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్, జెన్‌ప్యాక్, ఫస్ట్ అమెరికాన్, ఇనె్వంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, కానె్సంట్రిక్స్, యురేఖాఫోర్బ్స్, అపోలో ఫార్మసీ, శుభగృహ, టెలీపెర్ఫారెన్స్, ఉల్కన్ ఎక్స్‌ప్రెస్ (స్నాప్‌డీల్) అర్బిట్‌ఫిన్, కీ మేన్‌పవర్ కన్సల్టెన్సీలుగా తెలిపారు.