విశాఖపట్నం

సమీకృత క్రీడా గ్రామానికి మరింత మెరుగైన డిజైన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 30: అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత క్రీడా గ్రామాన్ని తీర్చి దిద్దే చర్యల్లో భాగంగా మరింత మెరుగైన డిజైన్ల కోసం విశాఖ నగరాభివృద్ధి సంస్థ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రాథమికంగా ఎంపిక చేసిన ఆర్కిటెక్టులకు మరింత మెరుగైన డిజైన్లను అందచేసేందుకు వీలు కల్పించింది. జిల్లాలోని ఆనందపురం మండలం గండిగుండం వద్ద దాదాపు 79 ఎకరాల్లో సమీకృత క్రీడా గ్రామాన్ని వుడా నిర్మించేందుకు నిర్ణయించడం తెలిసిందే. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించేందుకు వేదికల కొరతను అధిగమించేందుకు వీలుగా ఈ క్రీడా గ్రామాన్ని దాదాపు 350 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 16 క్రీడల్లో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు, వసతి, సమావేశాల నిర్వహణకు హాల్, పార్కింగ్, వివిఐపిల రాకపోకలకు ఏర్పాట్లు, ప్రేక్షకుల గ్యాలరీ వంటివి ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. భవిష్యత్తులో మరి కొన్ని క్రీడలకు వీలుగా విస్తరణను కూడా దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. ఈ మేరకు పెరెన్నికగన్న ఆర్కిటెక్ట్‌ల నుంచి నమూనాలను ఆహ్వానించారు. 8 మంది ఆర్కిటెక్ట్స్ నమూనాలను వుడా అధికారులకు అందచేశారు. అందులో 3 నమూనాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. వచ్చిన డిజైన్లు అంత సంతృప్తికరంగా లేకపోయినా, ప్రాథమికంగా మూడింటిని ఎంపిక చేశారు.అయితే వీటిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అధికారులు దృష్టి సారించారు. దీంతో ప్రాథమికంగా ఎంపికైన ముగ్గురు ఆర్కిటెక్ట్‌లను మెరుగైన డిజైన్లను అందచేయాలని కోరారు. డిజైన్లను అందచేసేందుకు ఇచ్చిన వ్యవధి తక్కువగా ఉండటంతో కొంత హడావుడిగా డిజైన్ చేశామని, కొంత సమయం ఇస్తే మరింత మెరుగైన డిజైన్లను రూపొందించగలమని ఆర్కిటెక్స్ చెప్పినట్లు తెలిసింది. దీంతో కొంత సమయం తీసుకుని మెరుగైన డిజైన్లను ఇవ్వాలని వుడా అధికారులు కోరారు. మెరుగైన డిజైన్లను అందచేశాక వాటిని సిఎం ఆమోదం తీసుకోనున్నారు. డిజైన్ ఖరారయ్యాక టెండర్లను ఆహ్వానించేందుకు వుడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.