విశాఖపట్నం

ఐఐపిఇ ప్రారంభానికి తుది ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 2: ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఇ) ప్రారంభానికి తుది ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన ఈ పెట్రోలియం వర్సిటీని తాత్కాలికంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు సబ్బవరం వద్ద ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించారు. కానీ అక్కడ పూర్తి స్థాయిలో భవనాలు తదితర సౌకర్యాలు కల్పించేందుకు కొంత సమయం పడుతుందని భావించి తాత్కాలికంగా ఎయులో ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఐఐటి జెఇఇ (అడ్వాన్స్‌డ్) ర్యాంక్‌ల ఆధారంగా ఈ సంస్థలో 2016-17 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలను కల్పించనున్నారు. దీంతో తాత్కాలికంగా ఎయు ఇంజనీరింగ్ కళశాలలో ఆరు గదులను కేటాయించారు. ఈ గదులకు మరమ్మతులు చేసి రంగులు వేస్తున్నారు. పెట్రోలియం ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్‌లో రెండు బిటెక్ ప్రోగామ్‌లను, రెండు పీజీ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనున్నారు. ఇంధన రంగంలో వస్తున్న మార్పులు, డిమాండ్‌కు అనుగుణంగా ఐఐటిల తరహాలో ఈ సంస్థను తీర్చిదిద్దనున్నట్లు ఐఐపిఇ సలహాదారు (అకడమిక్) డాక్టర్ విఎస్‌ఆర్‌కె ప్రసాద్ తెలిపారు. సాంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరులపై కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తారని వివరించారు. సబ్బవరంలో పూర్తి స్థాయిలో వసతి ఏర్పాటయ్యే వరకూ ఎయు ల్యాబ్‌లను, లెక్చర్ హాల్స్‌ను, వైఫై, గ్రంథాలయం వంటి సౌకర్యాలను వినియోగించుకుంటారని తెలిపారు. ప్రస్తుతం ఈ విద్యా సంస్థలో చేరే తొలి బ్యాచ్ విద్యార్థులుకు అవసరమైన వసతిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలినాళ్లలో ఐఐటి-ఖరగ్‌పూర్ విద్యా విషయాలపై సహకరిస్తుంది.