విశాఖపట్నం

కొనసాగుతున్న ఆసెట్ ప్రవేశాల కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 2: ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం అంబేద్కర్ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పిజి కోర్సులు, ఎయు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఆరేళ్ళ సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఆసెట్, ఆఈట్ 2016 ప్రవేశ పరీక్షల కౌనె్సలింగ్ రెండవ రోజు కొనసాగింది. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి 900 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సాయంత్రం వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకుని తమ సర్ట్ఫికెట్ల పరిశీలన జరిపించుకున్నారు. మొదటి రోజు ఎయు క్యాంపస్‌లోని కౌనె్సలింగ్ కేంద్రానికి 75 మంది విద్యార్థులు హాజరై సర్ట్ఫికెట్ల పరిశీలన జరిపించుకున్నారు. గురువారం మొత్తం 3600 ర్యాంకుల వారికి కౌనె్సలింగ్‌ను రాష్టవ్య్రాప్తంగా నాలుగు కేంద్రాల్లో నిర్వహించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి కౌనె్సలింగ్ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నట్టు కేంద్రం సంచాలకులు ఆచార్య యు.షమీమ్ తెలిపారు. మూడవ పట్టణ పోలీసులు విద్యార్థులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు.
నేటి కౌనె్సలింగ్ వివరాలు
ఆసెట్, ఆఈట్ ప్రవేశాల సర్ట్ఫికెట్ల పరిశీలన ఈ నెల 5వ తేదీ వరకు కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం సమీకృత ఇంజనీరింగ్‌లో 701 నుంచి 1200, లైఫ్ సైన్స్‌లో 910 నుంచి 1500, ఫిజికల్ 401-1000, కెమికల్ సైన్స్‌లో 1301-2300, మేథమెటిక్స్ సైన్స్‌లో 801-1400, హ్యుమానిటీస్ 1001- 2000, తెలుగులో 301-561 ఇంగ్లీషులో 301-500 ర్యాంకుల వరకు సర్ట్ఫికెట్ల పరిశీలన జరుపుతారు. విద్యార్థులు సర్ట్ఫికెట్లు, జెరాక్స్ కాపీలు, పాస్‌పోర్టు ఫోటోలు తమ వెంట తీసుకురావాలి.